బోర్డర్ లో టెన్షన్ :  భారత్‌కు కెనడా విమానాలు రద్దు 

  • Publish Date - February 28, 2019 / 03:53 AM IST

ఢిల్లీ : పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం అన్ని వ్యవస్థ ఉంటున్న క్రమంలో ఇంటర్నేషన్ ట్రాన్స్ పోర్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కెనడా భాతరదేశానికి విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రశిబిరాలను భారత్ ధ్వంసం చేసిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో కొనసాగుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నాయి.  పాక్ యుద్ధ సన్నాహాల్లో మునిగినట్టు వార్తలు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలను పాకిస్థాన్ మూసివేసింది. మూసివేసిన పాక్.. తమ గగనతలాన్ని కూడా మూసివేసింది. అంటే ఎయిర్ లింక్స్ ను క్లోజ్ చేసింది. 
 

చాలా వరకు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లాయి. ఈ క్రమంలో ఎయిర్ కెనడా భారత్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో టొరొంటో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం మార్గమధ్యంలోనే కెనడాకు తిరిగి వచ్చేసింది. వాంకోవర్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని కూడా  రద్దు చేసింది. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమేనని..పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఎయిర్ కెనడా స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు