వియన్నాలో ఉగ్రదాడి…ఇద్దరు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : November 3, 2020 / 08:13 AM IST
వియన్నాలో ఉగ్రదాడి…ఇద్దరు మృతి

Terror Attack In Vienna ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సోమవారం రాత్రి పలువురు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు కాల్చేసినట్లు వియన్నా పోలీసు విభాగం ప్రకటించింది. కాగా, ఆస్ట్రియన్ ఛాన్సలర్ దీనిని ‘ఉగ్ర దాడి’ గా అభివర్ణించింది.



సెంట్రల్ వియాన్నాలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8గంటల సమయంలో షూటౌట్ జరిగింది. గన్స్ తో వచ్చిన పలువురు ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఆగంతకుల కాల్పులను తిప్పికొట్టే క్రమంలో ఓ ఆగంతకుడిని పోలీసులు కాల్చేశారు. అంతేకాకుండా, నగరంలోని ఆరు చోట్ల ఆగంతకులు కాల్పులకు తెలబడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.



కాగా,కరోనా కట్టడికి మరోసారి లాక్ విధించాలని ఆస్ట్రియా నిర్ణయించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందే ఈ కాల్పులు వియన్నాలో కలకలం రేపాయి.
https://10tv.in/3-killed-in-attack-at-a-church-in-nice-terror-attack-suspected/
వియన్నాలో జరిగిన దాడి విషాదకరమని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్ చేశారు. మాక్రాన్ మాట్లాడుతూ, “ఫ్రాన్స్ తరువాత, మన దగ్గరి దేశం ఆస్ట్రియాను లక్ష్యంగా చేసుకున్నారు. మనం నమస్కరించి కలిసి పోరాడలేమని మన శత్రువులు తెలుసుకోవాలి అని ట్వీట్ చేశారు.