తగిన శాస్తి : పాక్‌ ఆర్మీపై ఉగ్రదాడి, 9మంది సైనికులు మృతి

పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 02:33 AM IST
తగిన శాస్తి : పాక్‌ ఆర్మీపై ఉగ్రదాడి, 9మంది సైనికులు మృతి

పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్

పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్ రాష్ట్రంలో పాక్ సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ భీకర దాడిలో 9మంది సైనికులు చనిపోయారు. 11మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బలూచిస్థాన్ దాడి వెనుక బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ సంస్థలు ఉన్నాయని పాక్ నిఘా ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాడికి తమదే బాధ్యత అని ప్రకటించినట్టు పాక్ మీడియా పేర్కొంది. పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ విధంగా అయితే భారత జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారో సరిగ్గా అదే రీతిలో పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ బాంబర్ అటాక్ చేశాడు.

 

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడంతో పాక్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్… తాజా ఉగ్రదాడితో సౌదీ యువరాజు ఎక్కడ మనసు మార్చుకుని పర్యటన రద్దు చేసుకుంటాడోనని ఆందోళనకు గురైంది. అయితే సౌదీ ప్రిన్స్ ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టడంతో పాక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 

పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు నిత్యం మన దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడుతున్నారు. సైనికులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నారు. కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి లోయలో కల్లోలం సృష్టిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో యావత్ దేశం ప్రతీకారంతో రగిలిపోతోంది. ఆర్మీ కూడా సమరానికి సై అంది. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే శత్రు దేశంపై దాడి చేసి ముష్కర శిబిరాలను ధ్వంసం చేసి మూకలను మట్టుబెట్టేందుకు సిద్ధంగా ఉంది.