అపార్ట్‌మెంట్‌లో అలజడి : పార్కింగ్‌లో పేలిన టెస్లా కారు

టాయిడి ఫ్లవర్ గార్డెన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో నిలిపిన ఎలక్ట్రానిక్ టెస్లా కారు ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

  • Published By: sreehari ,Published On : April 23, 2019 / 12:55 PM IST
అపార్ట్‌మెంట్‌లో అలజడి : పార్కింగ్‌లో పేలిన టెస్లా కారు

టాయిడి ఫ్లవర్ గార్డెన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో నిలిపిన ఎలక్ట్రానిక్ టెస్లా కారు ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. అండర్ గ్రౌండ్ నుంచి భారీ శబ్దం రావడంతో అందులోని నివాసులు భయంతో వణికిపోయారు. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. టేయిడి ఫ్లవర్ గార్డెన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో నిలిపిన ఎలక్ట్రానిక్ టెస్లా కారు ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో టెస్లా కారు దగ్ధం కాగా.. పక్కనే ఉన్న ఆడి కారు కూడా దగ్ధమైంది.
Also Read : షాకింగ్.. లక్షలు కొట్టేశారు : దొంగల బైక్ ఈడ్చుకెళ్తున్నా బ్యాగు వదల్లేదు

ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. దీనికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు చైనీస్ సోషల్ మీడియా Weibo సైట్లో వైరల్ అవుతున్నాయి. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం.. టెస్లా కారులో మంటలు వ్యాపించడానికి గల కారణాలపై ఎలక్ట్రానిక్ కారు కంపెనీ విచారణ చేపట్టింది. ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీ ఫెయిల్ కావడం కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఎలక్ట్రానిక్ కారు ఎంతవరకు సురక్షితం అనేదానిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కారు మేకర్ కు చెందిన విచారణ బృందం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించినట్టు వెయిబో అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘మంచికో.. చెడుకో.. పాజిటీవ్ లేదా నెగటీవ్ పోస్టు పెడుతున్నా.. చైనాలోని షాంఘైలో ఎలక్ట్రానిక్ వెహికల్ టెస్లా (EV) కారులో మంటలు చెలరేగాయి. అండర్ గ్రౌండ్ పార్క్ లో నిలిపిన చైనా ఫస్ట్ జనరేషన్ టెస్లా మోడల్ ఎస్ కారు పేలింది’ అని జేయ్ ఇన్ షాంగై ట్విట్టర్ అకౌంట్లో వీడియోతో పాటు షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్