Russia vs Ukraine War: పుతిన్‌తో మాట్లాడిన తరువాతే ఎలాన్ మస్క్ ట్విటర్‌లో శాంతి ప్రతిపాదన చేశాడా.. అసలు విషయం ఏమిటంటే?

రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ నివారణకు శాంతి ఒప్పందాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్ వేదికగా తెరపైకి తెచ్చాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు. అయితే, మస్క్ శాంతి ప్రతిపాదన కంటే ముందు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్‌తో మాట్లాడాడని, పుతిన్ సూచన మేరకే మస్క్ ట్విటర్‌లో శాంతి ఒప్పందంపై ట్వీట్లు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను మస్క్ కొట్టిపారేశారు.

Russia vs Ukraine War: పుతిన్‌తో మాట్లాడిన తరువాతే ఎలాన్ మస్క్ ట్విటర్‌లో శాంతి ప్రతిపాదన చేశాడా.. అసలు విషయం ఏమిటంటే?

Putin and Musk

Russia vs Ukraine War: రష్యా- యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపందాల్చింది. రష్యాను, క్రిమియాను కలిపే వంతెనపై పేలుళ్ల తరువాత రష్యా సైన్యం యుక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. అయితే ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రష్యా- యుక్రెయిన్ మధ్య ట్విటర్ వేదికగా శాంతి ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదనను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తీవ్రంగా వ్యతిరేకించాడు.

Russia-Meta: రష్యా సంచలనం.. ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం

ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని మస్క్ తెరపైకి తేవడానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్‌తో మాట్లాడాడని, పుతిన్ సూచన మేరకే మస్క్ ట్విటర్‌లో శాంతి ఒప్పందంపై ట్వీట్లు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయాన్ని మస్క్ తనతో చెప్పాడని యురేషియా గ్రూప్ హెడ్ ఇయాన్ బ్రెమ్మర్ తన సన్నిహితులతో పేర్కొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. క్రిమియా రష్యాతో ఉండాలనే షరతుపై వ్లాదిమిర్ పుతిన్ “చర్చలకు సిద్ధంగా ఉన్నారని” ఎలోన్ మస్క్ తనతో చెప్పాడని ఇయాన్ బ్రెమ్మర్ చెప్పాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యుక్రెయిన్ ఏదో ఒక విధమైన శాశ్వత తటస్థతను అంగీకరించి, లుహాన్స్క్, డొనెట్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తిస్తే రష్యా దండయాత్రను ముగించడానికి సిద్ధంగా ఉందని పుతిన్ స్వయంగా ఎలాన్ మస్క్‌తో చెప్పారని, అదే విషయాన్ని తనతో చెప్పాడని ఇయాన్ బ్రెమ్మర్‌ పేర్కొన్నారట. పుతిన్ తన లక్ష్యాలపై స్పష్టంగా ఉన్నాడని, అవినెరవేరకుంటే యుక్రెయిన్ పై దాడులను మరింత పెచ్చేందుకు వెనుకాడడని మస్క్ తనతో పేర్కొన్నట్లు బ్రెమ్మర్ అన్నారు. అయితే బ్రెమ్మర్ తెలిపిన విషయాలపై ఎలాన్ మస్క్ స్పందించారు. వ్లాదిమిర్ పుతిన్‌తో తాను ఇటీవల మాట్లాడినట్లు వస్తున్న వార్తలను మస్క్ కొట్టిపారేశారు.