మాస్క్ ఉంటే రావొద్దు.. భయం వేస్తే ఇంట్లోనే ఉండండి: బార్ ముందు పోస్టర్

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 07:38 AM IST
మాస్క్ ఉంటే రావొద్దు.. భయం వేస్తే ఇంట్లోనే ఉండండి: బార్ ముందు పోస్టర్

అమెరికాలో రోజురోజుకూ వేలల్లో చనిపోతున్నా నిర్ణయాల్లో మార్పు ఉండటం లేదు. అజాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా ప్రజలను ప్రమాదంలోకి నెట్టేలా ఆలోచిస్తున్నారు. టెక్సాస్‌లో ఫేస్ మాస్క్ వేసుకుని వస్తే అనుమతించమని ఓ బార్ చెప్తుంది. టెక్సాస్‌లోని లిబర్టీ ట్రీ తావెర్న్ పోస్టర్ లో ఈ సూచన రాసి ఉంచారు. మాస్క్ లు వేసుకున్న వారు బార్ కు దూరంగా ఉండండి. 

అంతేకాకుండా మరో ఉచిత సలహా ఇచ్చారు. ‘మాస్క్ వేసుకుంటేనే సేఫ్ గా ఉంటామని ఫీల్ అయితే అప్పటివరకూ ఇంట్లో నుంచి బయటకు రాకండి’ అని రాసి ఉంది. తాము అన్నీ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటిస్తున్నామని బార్ సహ యజమాని అయిన కెవిన్ స్మిత్ అన్నారు. ప్రస్తుతం బార్ 25శాతం కెపాసిటీతో నడుస్తుండగా కస్టమర్లు ఒకొక్కరుు 6అడుగుల దూరంలో కూర్చొని ఉంటున్నారు. 

COVID-19 కారణంగా యునైటెడ్ స్టేట్స్ లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏ దేశంలో నమోదుకానన్ని కేసులు అమెరికాలోనే ఫైల్ అయ్యాయి. గత 24గంటల్లోనే వెయ్యి 297 మరణాలు సంభవించినట్లు సమాచారం. ఆ బార్ తీసుకున్న నిర్ణయానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. 

‘కరోనా పెంచుదామనుకుంటున్నారా అని అడుగుతుంటే.. మరి కొందరు మాస్క్ లు పెట్టుకుని ఎలా తాగుతాం. ఇదే కరెక్ట్ అంటున్నారు. ట్రంప్ యాంటీ మాస్క్ బార్ వరకూ పాకినట్లుంది. మాస్క్ వేసుకుంటే అనుమతించరట. ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడమే మంచిది’ అని కామెంట్లు చేస్తున్నారు. 

Read: మంచి Roommateగా ఉండాలంటే 7రూల్స్