Thai man : ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాడు..వచ్చిన ఐటమ్ చూసి షాక్ తిన్నాడు

థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి iPhone 7 ఆర్డర్ ఇచ్చాడు. కానీ..వచ్చిన ఐటమ్ చూసి నోరెళ్లబెట్టాడు.

Thai man : ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాడు..వచ్చిన ఐటమ్ చూసి షాక్ తిన్నాడు

Apple product

 iPhone 7 : iPhone కొనుక్కోవాలని అందరూ అనుకుంటుంటారు. ఎందుకంటే..అదిరిపోయే ఫీచర్లు ఉండే ఈ ఫోన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి ఇష్టం. కానీ..అంత ధర పెట్టడం ఎందుకు..అని ఏదో తమకు తోచిన బడ్జెట్ లో ఫోన్లు కొనుక్కొని వాడుతుంటారు. అయితే..ఇక్కడ బయటి షాపుల్లో కంటే..ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్లలో తక్కువ రేటుకే లభిస్తాయి. అంతేగాకుండా..అదిరిపోయే ఆఫర్లు కూడా ఉంటాయి. వీటికి అట్రాక్ట్ అయి..తమకు తోచిన ఫోన్లను ఆర్డర్ ఇస్తుంటారు. ఇలాగే..థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి iPhone 7 ఆర్డర్ ఇచ్చాడు. కానీ..వచ్చిన ఐటమ్ చూసి నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

Phone

థాయ్ లాండ్ కు చెందిన ఓ టీనేజర్ ఫోన్ కొనుక్కోవాలని అనుకున్నాడు. ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్లలో iPhone 7 చూశాడు. దాని రేటు తక్కువగా ఉండడంతో ఆశ్చర్యపోయాడు. ఇంత తక్కువ రేటు ఉండడం ఏంటీ అని అనుకున్నాడు. ఏమైందిలే..అనుకుంటూ..గబగబా ఆర్డర్ పెట్టేశాడు. కరోనా ఉన్న కాలంలో..ముందుగానే డబ్బులు చెల్లించాలని చెప్పారు. అలాగే చేశాడు. తన ఫోన్ ఎప్పుడు వస్తుందా ? దానిని ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురు చూడసాగాడు.

నాలుగు రోజుల తర్వాత..డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడు. అతని అడ్రస్, ఆర్డర్ ఇచ్చిన ఐటెంను చెక్ చేసుకుని…ఓ భారీ ఐటెంను టీనేజర్ చేతిలో పెట్టాడు. ఫోన్ ఇంత పెద్దగా ఉండడం ఏంటీ ? అని ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద ఐటంను ఆర్డర్ ఇవ్వలేదు…కేవలం iPhone 7 ఫోన్ మాత్రమే ఆర్డర్ ఇచ్చానని డెలివరీ బాయ్ కు చెప్పాడు. ఇదే నువ్వు ఆర్డర్ ఇచ్చింది..టైటిల్ చూడు..నాకు తెల్వదు..అంటూ ఆ భారీ ఐటెంను అతని చేతిలో పెట్టేసి తుర్రుమన్నాడు.

దానిని ఇంట్లోకి వెళ్లి ఓపెన్ చేశాడు. కాఫీ టేబుల్ లా ఉంది. చూడటానికి మాత్రం iPhone ఆకారంలో ఉంది. అది చెక్క టేబుల్ కాబట్టి..తక్కువ ధర ఉంది అని అనుకున్నాడు. ఆ టేబుల్ ను ఆన్ లైన్ సైట్ లో ఐ ఫోన్ లాగా ఫొటో తీసి పెట్టాడు. ఆ టేబుల్ తనకు నచ్చిందని, రిటర్న్ ఎందుకు ఇవ్వడం అనుకుని…తనలా మరెవరూ మోసపోవద్దంటూ చెప్పాడు.

 

View this post on Instagram

 

A post shared by 텐바이텐 공식 인스타그램 (@your10x10)