Thailand: థాయ్‌లాండ్ నైట్‌క్లబ్‌లో 13మంది మృతి.. 14మంది పరిస్థితి విషమం

థాయ్‌లాండ్‌లోని ఈస్టరన్ చొంబరీ ప్రాంతంలో నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 35 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని బాధితులంతా థాయ్ దేశస్థులేనని పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ అధికారుల సమాచారం ప్రకారం.. 14మంది ఆరోగ్య స్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

Thailand: థాయ్‌లాండ్ నైట్‌క్లబ్‌లో 13మంది మృతి.. 14మంది పరిస్థితి విషమం

 

 

Thailand: థాయ్‌లాండ్‌లోని ఈస్టరన్ చొంబరీ ప్రాంతంలో నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 35 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని బాధితులంతా థాయ్ దేశస్థులేనని పోలీసులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ అధికారుల సమాచారం ప్రకారం.. 14మంది ఆరోగ్య స్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

బ్యాంకాక్ కు 111 మైళ్ల దూరంలో ఉన్న మౌంటైన్ B నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రమాదం జరిగింది. స్థానిక మీడియాలో కథనం ప్రకారం.. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ వర్కర్లు మంటల్లో చిక్కుకున్న వారిని కాలిన గాయాలతో కాపాడగలిగారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి తన ఐదుగురి స్నేహితులతో కలిసి వెళ్లినట్లు వెల్లడించింది.

“స్టేజి మీద కుడివైపు నుంచి మంటలు వ్యాపించినట్లు కనిపించింది. అదే సమయంలో సింగర్ కూడా స్టేజ్ మీదనే ఉన్నారు. మంటలను చూసి మైక్ విసిరేయడంతో పాటు అక్కడి నుంచి దూకేశారు. చాలా మంది బౌన్సర్లు మంటల్లోనే ఇరుక్కుపోయారు” అని మహిళ తెలిపింది.

Read Also: థాయ్‌లాండ్ టూరిస్ట్‌పై హర్యానాలో గ్యాంగ్ రేప్

ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్ ఒచా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంటర్‌టైన్మెంట్ వేదికలు తగు జాగ్రత్తలు పాటించాలని, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండేలా చూసుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

బ్యాంకాక్ లోని సంటికా నైట్ క్లబ్ లో ఘటన జరిగిన 13ఏళ్లకు మరోసారి ఇటువంటి ఘటనే నమోదైంది. సదరు ఘటనలో 66మంది హతమయ్యారు. అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని విచారణలో వెల్లడైంది.