అదేపనిగా మాంసం తిన్నఅతని కడుపులో పెరిగిన 17 అడుగుల పాము..!!

  • Published By: nagamani ,Published On : September 25, 2020 / 01:58 PM IST
అదేపనిగా మాంసం తిన్నఅతని కడుపులో పెరిగిన 17 అడుగుల పాము..!!

అతనికి మాంసం అంటే ఇష్టం. ఇష్టమంటే అలాంటింలాంటి ఇష్టం కాదు. ఏకంగాపచ్చి మాంసం ముక్కల్నే గుటుక్కు గుటుక్కుమనిపించేంత ఇష్టం. కూర ఉడుకుతుండగానే వేడి వేడి ముక్కల్ని లటుక్కున నోట్లో వేసుకుంటాడు. అలా మాంసం విపరీతంగా తినేవాడు. అలా తినే అతని కడుపులో ఏకంగా 17 అడుగుల పొడుగున పసుపు పచ్చరంగు ( ఎల్లో టేప్‌ వార్మ్‌) పాము పెరిగిపోయింది. టేప్‌వార్మ్ అంటే..మ‌నుషులు, జంతువుల ప్రేగు లోప‌ల నివ‌సించే ఒక ర‌క‌మైన‌ ఏలిక‌పాములు.


థాయ్‌లాండ్‌లోని నఖోవ్ సావాన్ ప్రాంతానికి చెందిన డుయాంగ్‌చ‌న్ డాచోడ్డే అనే 43 ఏండ్ల వ్య‌క్తికి తీవ్రమైన కడుపునొప్పి వస్తోంది. ఓ సారి టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు మలద్వారం నుంచి పసుప్పచ్చని పాములాంటిది బైటకు వచ్చింది. అది చూసిన డుయాంగ్ చన్ హడలిపోయాడు. దీని వల్లే తనకు కడుపునొప్పి అని భావించి వెంటనే..దాన్ని తీసుకుని మీర డాక్ట‌ర్ వ‌ద్ద‌కు పరిగెత్తాడు.


దాన్ని పరీక్షించిన డాక్టర్లు ఉడకని మాంసాన్ని తినడం వల్ల కడుపులో ఇలాంటి నులిపురుగులు చేరతాయని, ముఖ్యంగా గొడ్డుమాంసం టేప్‌వార్మ్‌గా గుర్తించారు. దీనిని టైనియా సాగినాటా అని పిలుస్తారనీ..ప‌చ్చిమాంసం తిన‌డం వ‌ల్ల అత‌ని శ‌రీరం లోప‌లికి ఓ సూక్ష్మ రూపంలో పొట్టలోకి చేరి అది క్రమేపీ పెరిగిపోయిందని తెలిపారు.



అయితే ఇది బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ తరువాత నుంచి అత‌ని క‌డుపు బాగానే ఉన్న‌ట్లు తెలిపారు. కానీ క‌డుపులో ఇంకా పురుగులు ఉన్నాయ‌ని తెలిసి భ‌యం వేస్తుంది అని వాపోయాడు డుయాంగ్‌చ‌న్‌. కానీ అవి కడుపులోని నశించి మలం ద్వారా బైటకు రావటానికి డాక్టర్లు మందులు రాసిచ్చారు. భయపడొద్దు ఇంకెప్పుడు పంచి మాంసం తినొద్దు అని సూచించారు.


కాగా..ఇటువంటి ఏలిక పాములు మానవ శ‌రీరంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు అనేక జీవ‌సంబంధ స‌మ‌స్య‌లు క‌లిగిస్తాయి. దీనిని టేప్‌వార్మ్ ఇన్‌ఫెక్ష‌న్ అని అంటారు. ఈ స‌మ‌స్య వచ్చినప్పుడు మనుషులకు వాంతులు, వికారం, బ‌ల‌హీన‌త‌, అల‌స‌ట‌, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఎక్కువ‌గా పంది మాంసం, గొడ్డు మాంసం తినేవారికి ఈ ఇన్‌ఫెక్ష‌న్ సోకుతుందని డాక్టర్లు తెలిపారు.