Injured Cockroach : బొద్దింకకు సీరియస్..చికిత్స చేసి ప్రాణం పోసిన డాక్టర్

రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న ఓ బొద్దింకను హాస్పిటల్ కు తీసుకెళ్లాడో వ్యక్తి. మనుషులు చావు బతుకుల్లో ఉంటనే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ బొద్దింకను హాస్పిటల్ కు తీసుకెళ్లటం ఓ డాక్టర్ దానికి చికిత్స్ చేసి కాపాడటం గురించి తెలుసుకుని నెటిజన్లు ప్రసంశంలు కురిపిస్తున్నారు.

Injured Cockroach : బొద్దింకకు సీరియస్..చికిత్స చేసి ప్రాణం పోసిన డాక్టర్

Injured Cockroach

Man takes injured cockroach : అదిగో బొద్దింక అంటూ చాలు చాలామంది అద్దిరిపోయా ఆమడదూరం పారిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు బొద్దింకంటే మహా చికాకు. వంటింటిలో ఒక్క బొద్దింక కనిపిచిందంటే చాలు వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దాన్ని చంపేదాకా వంటింటివైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ‘‘పాపం బొద్దింక’’అంటూ గాయపడిన ఓ బొద్దింకను చేతుల్లోకి తీసుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. వినటానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా నిజం. థాయ్ లాండ్ లో జరిగిన ఈ వింత సందర్భం జరిగింది. రోడ్డు పక్కన మనుషులు చావు బతుకుల్లో ఉంటేనే చూసి చూడనట్లుగా వెళ్లిపోతాం. అటువంటిది ఓ చిన్నప్రాణి కోసం థాయ్ లాండ్ లో ఓ వ్యక్తి తన పని మానుకుని మరీ దాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.

థాయిలాండ్​కు చెందిన ఒక వ్యక్తి పనిమీద వెళుతూ రోడ్డు పక్కన నడుస్తున్నాడు. అలా నడుస్తున్న అతనికి ఓచోట ఓ బొద్దింక కనిపించింది. బహుశా ఎవరో పాదచారులు తొక్కితే అలా అయి ఉండొచ్చు. కానీ అది గాయాలతో చనిపోయేలా కన్పించటంతో అతను అందరిలా వెళ్లిపోలేదు. అయ్యో పాపం చచ్చిపోతుందేమో అని జాలిపడ్డాడు.ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దాన్ని చూసి చలించిపోయాడు. వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని థాయ్‌లాండ్‌లోని క్రతుం బేన్‌కు చెందిన ఓ వెటర్నరీ డాక్టర్​ వానిచ్​​ వద్దకు తీసుకెళ్లాడు.

డాక్టర్ కు అసలు విషయం చెప్పాడు. ఓ చిన్న అల్పప్రాణి కోసం అంత దూరం వచ్చి దాన్ని కాపాడాలని సదరువ్యక్తి చెబుతుంటే ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతటి దయకలవారు కూడా ఉంటారా? అని అనుకున్నాడు. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బొద్దికంకు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఇక దాని ప్రాణాలకేమీ ప్రమాదం లేదులే..అని చెప్పటంతో ఆ వ్యక్తి కళ్లలో కనిపించిన ఆనందానికి ఆ డాక్టర్ చాలా సంతోషించాడు. అతన్ని అభినందించాడు.

ఈ విషయాన్ని డాక్టర్​ తన ఫేస్​ బుక్​ ద్వారా తెలిపాడు. “గత రాత్రి ఒక వ్యక్తి నా వద్దకు ఓ బొద్దింకను తీసుకొచ్చాడు. బొద్దింక సీరియస్​ కండీషన్​లో ఉంది. బొద్దింకే కదా అని ఆ వ్యక్తి కూడా తేలిగ్గా తీసుకోలేదు. నేను కూడా జోక్​గా తీసుకోకుండా వెంటనే చికిత్స చేయటంతో అది ప్రాణాలను రక్షించాను. ఇలా బొద్దింకకు చికిత్స చేయడం నా జీవితంలో మొదటిసారి. ఏదేమైనా..సృష్టిలో ప్రతి ప్రాణం విలువైనదే అతను కూడా అలాగే ఆలోచించి ఆ చిన్న ప్రాణి కోసం అంత దూరం నుంచి వచ్చాడని నేను కూడా దాన్ని కాపాడానని తెలిపారు. గుర్తించి బొద్దింకను చికిత్స కోసం తీసుకొచ్చిన వ్యక్తి నిజంగా చాలా గొప్పవాడు..అందుకే అతనికి హాట్సాఫ్​ చెబుతున్నా. ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నా.” అని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు బొద్దింకను తీసుకొచ్చిన వ్యక్తిని..దానికి చికిత్స చేసిన డాక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.