వావ్..‘ఏనుగు సవారీ’ పెళ్లిళ్లు..బొటానికల్ గార్డెన్‌లో ఒక్కటైన 59 జంటలు

వావ్..‘ఏనుగు సవారీ’ పెళ్లిళ్లు..బొటానికల్ గార్డెన్‌లో ఒక్కటైన 59 జంటలు

Thailand 59 couples riding elephants :  ఫిబ్రవరి 14. ప్రేమికుల దినోత్సవం రోజున థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 59 జంటలు ఏనుగులపై ఊరేగుతూ వచ్చి ఒక్కటయ్యారు. ప్రేమికుల రోజున లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు.బహుమతులు ఇచ్చి పుచ్చుకుని ఆనందంగా గడుపుతారు. కానీ బ్యాంకాక్ లోని ఓ బొటానికల్ గార్డెన్‌లో జరిగిన ఈ సామూహిక వివాహాలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. ఎంతగానో అలరించాయి. గజరాజుల్ని అందంగా ముస్తాబు చేసి దానిమీద వధూవరులు ఊరేగుతూ వచ్చారు.

సంప్రదాయంగా ముస్తాబైన వధూవరులు.. మేళతాళాలు, డ్యాన్స్‌లతో ఉత్సాహంగా ఊరేగింపుగా బయలుదేరారు. ఆ అందాల జంటల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవన్నట్లుగా ఉంది అక్కడి సందడి. ఏనుగుల మీద వధూవరులు ఊరేగుతూ రావటం విశేషమనుకుంటూ స్థానిక అధికారులు కూడా ఏనుగులపైనే ఊరేగుతూ రావటం మరో విశేషం.

 

ఈ సామూహిక వివాహాల ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు కూడా ఏనుగుల మీద ఊరేగితూ వచ్చారు. వారికి వివాహాలు చేసి వధూవరులకు మ్యారేజ్ లైసెన్సులు అందించారు. అలా ఆ సామూహిక వివాహాల కార్యక్రమం అంతా గజరాజులతో సందడి సందడిగా మారిపోయింది. అలా వినూత్న రీతిలో ఒక్కటైన 59 జంటలు ఎంతో ఉత్సాహంగా చిందులేశారు.

ఈ వివాహాల్లో పటిఫట్ పంథనాన్ 26 ఏళ్ల పెళ్లికొడుకు మాట్లాడుతూ.. తాను అందరిలా కాకుండా డిఫరెంట్ గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకునేవాడిని. నేను అనుకున్నట్లుగానే ఇలా నా వివాహం చేసుకున్నాను. దానికి నాకు చాలా ఆనందంగా ఉందని నవ్వుతూ చెప్పాడు. ఈ వినూత్న కార్యక్రమంలో వివాహ లైసెన్స్‌పై సంతకం చేయాలని ప్లాన్ చేసుకున్నాను. అనుకున్నట్లుగానే ఈ రోజు నిజమైందంటూ 23 ఏళ్ల వధువు సిగ్గులొకుతుండగా చెప్పాడు.

నిజానికి చోంబురి ప్రావిన్స్‌లోని నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్‌లో ఏటా జరిగే ‘ఏనుగు సవారీ’ పెళ్లిళ్లకు వందలాదిమంది జనాలు తరలివస్తారు. వివాహాలు చేసుకునే వధూవరులతో పాటు ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చే జనాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోతుంది. ఇలా వినూత్నంగా వివాహాలు చేసుకోవటానికి థాయ్ లాండ్ వాసులు ఆసక్తి చూపిస్తారు. ఎంతోమంది వందలాదిమంది జంటలు ఇలా ఏనుగులమీద ఊరేగుతూ ఒక్కటవ్వటం ప్రతీ సంవత్సరం జరిగేది.

కాకపోతే..కరోనా కారణంగా ఈసారి ఆ సంఖ్య 59కి పడిపోయింది. నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్ అధ్యక్షుడు కాంపోన్ టాన్సాచా మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో కఠినమైన ఆంక్షల విధిస్తుండడం కారణంగా సురక్షితమని భావిస్తుండడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే పార్క్‌కు వస్తున్నారని తెలిపారు.