Thailand prime Minister Suspended : దేశ ప్రధానినే సస్పెండ్ చేసిన కోర్టు .. ఎందుకంటే..

ఒక దేశ ప్రధానినే కోర్టు సస్పెండ్ చేసింది. ప్రధాని పదవి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. థాయ్​లాండ్​ ప్రధానమంత్రి ప్రయూత్​ చాన్​ వో చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ​ చేసింది రాజ్యాంగ కోర్టు.

Thailand prime Minister Suspended : దేశ ప్రధానినే సస్పెండ్ చేసిన కోర్టు .. ఎందుకంటే..

Thailand prime minister suspended

Thailand prime minister suspended : ఒక దేశ ప్రధానినే కోర్టు సస్పెండ్ చేసింది. ప్రధాని పదవి బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. థాయ్​లాండ్​ ప్రధానమంత్రి ప్రయూత్​ చాన్​ వో చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ​ చేసింది రాజ్యాంగ కోర్టు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రధానిగా కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు పిటిషన్​ను దాఖలు చేశాయి. దీని​పై విచారించిన న్యాయస్థానం గురువారం (ఆగస్టు 25,2022) 68 ఏళ్ల ప్రధాని ప్రయూత్​ చాన్​-వో-చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ​ చేసింది.

ప్రధానమంత్రి ప్రయూత్​ తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు పిటిషన్​ విచారించిన న్యాయస్థానం.. వారి వాదనతో ఏకీభవించింది. అయితే పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారా? లేదా అనే ఆంశంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు సస్పెన్షన్​ అమల్లో ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రయూత్​కు సూచించింది.కానీ ప్రస్తుతం ప్రయూత్ చేతిలో ఉన్న రక్షణ శాఖను కొనసాగించాలా లేదా దానిని కూడా వదులుకోవాలా? అనే విషయంపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. తాత్కాలిక ప్రధాని ఎవరు అనేది నిర్ణయించలేదు.

కాగా.. థాయ్ లాండ్ రాజ్యాంగం ప్రకారం ఉపప్రధానమంత్రి ప్రవిత్​ వాంగ్​సువన్​ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రయూత్​ నాయకత్వంలోని సైనిక కూటమి 2014 మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం నాటికే ప్రయూత్​ పదవీ కాలం ముగిసింది. కానీ ఆయన పదవిలో కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయూత్​ మద్దతుదారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.

సవరించిన రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవీ కాలం 8 సంవత్సరాలని.. దీని ప్రకారం ఇది అమల్లోకి వచ్చిన 2017 ఏప్రిల్​ 6 నుంచి వర్తిస్తుందని వాదిస్తున్నారు. మరోవైపు కొత్త రాజ్యాగం ప్రకారం 2019 జూన్​ 9న ప్రయుత్​ బాధ్యతలు చేపట్టినందున.. నాటి నుంచే పదవీ కాలం మొదలవుతుందని కొందరు వాదిస్తున్నారు. ప్రయూత్ పదవీకాలానికి సంబంధించి తిరుగుబాట్లు,హింసాత్మక నిరసనలు జరిగాయి. రాజకీయాలలో సైనిక ప్రమేయంపై వ్యతిరేకత వచ్చింది.