వికలాంగ కుక్కల ఆశ్రమానికి కష్టాలు..మూగ జీవాల జాలి చూపులు

వికలాంగ కుక్కల ఆశ్రమానికి కష్టాలు..మూగ జీవాల జాలి చూపులు

thailand shelter :థాయ్‌లాండ్‌లోని ది మ్యాన్ దట్ రెస్క్యూస్ డాగ్స్ అనే ఫౌండేషన్ వికలాంగ కుక్కలకు ఆశ్రయమిస్తోంది. వికలాంగ కుక్కల కోసం ఓ ఆశ్రమాన్ని స్థాపించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అంగవైకల్యంతో బాధపడుతూ కపుడు నింపుకోవటానికి నానా కష్టాలు పడే వికలాంగ కుక్కల పాలిట వరంగా మారిందో స్వచ్ఛంధ సంస్థ.

దాదాపు 600 పైగా కుక్కులు ఈ ఆశ్రమంలో సెద తీరుతున్నాయి. అయితే ఆ స్వచ్చంధ సంస్థకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రధానంగా థాయ్‌లాండ్ టూరిజంపైనే ఆధారపడి ఉంటుంది. థాయ్ లాండ్ కు వచ్చేటూరిస్టుల ద్వారా ఈ కుక్కల సంస్థకు విరాళాలు వస్తుంటాయి.

కానీ ప్రపంచ దేశాలను గడగడలాడించిన..ఇంకా హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి వల్ల థాయ్ లాండ్ కు పర్యటకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఆ ప్రభావం ఈ కుక్కలకు ఆశ్రయం కల్పించే సంస్థ మీద కూడా పడింది. విరాళాలు అందకపోవటంతో ఆ కుక్కల్ని పోషించటం కష్టంగా మారిందా సంస్థకు.

వాటికి ఆహారం..మెడిసిన్స్, మెయింటెనెన్స్ ఇలా ఎన్నో ఖర్చులకు డబ్బులు కటకటలాడిపోవటం నానా కష్టాలు పడుతోందా ది మ్యాన్ దట్ రెస్క్యూస్ డాగ్స్ అనే ఫౌండేషన్. ఇప్పటి వరకూ టూరిస్టులు అందించే విరాళాలతో నడిచే ఆ సంస్థ అంగ వైకల్యంతో బాధపడుతున్న ఈ శునకాలకు ప్రత్యేక ఏర్పాట్లు ద్వారా వాటికి వాటికి ఏ లోటు లేకుండా చూసుకుంటోంది.

2002 లో ది మ్యాన్ దట్ రెస్క్యూస్ డాగ్స్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి..ప్రమాదానికి గురైన కుక్కల్ని ఈ ఆశ్రమంలో చేర్చి వాటికి చికిత్స ప్రత్యేక అందిస్తున్నారు స్థానిక అధికారులు.