ఇన్ స్టాంట్ ఖర్మ అంటే ఇదే : దుప్పిని కాల్చి వేటగాడు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : October 27, 2019 / 01:35 PM IST
ఇన్ స్టాంట్ ఖర్మ అంటే ఇదే : దుప్పిని కాల్చి వేటగాడు మృతి

దుప్పి కాల్చి ఓ వేటగాడు చనిపోయాడు. దుప్పిని తుపాకీతో కాల్చి వేటగాడు చనిపోవడం ఏంటని అనుకుంటున్నారా?ఇది నిజమే. అమెరికాలో ఈ సంఘటన జరిగింది.

అమెరికాకు చెందిన అలెగ్జాండర్ మంగళవారం ఓజార్క్ పర్వతాలలో ఉన్న యెల్విల్లే సమీపంలో వేటాడుతున్న సమయంలో ఆయనకు ఓ దుప్పి కన్పించింది. దానిని తన వెంట తెచ్చుకున్న గన్ తో కాల్చాడు. అయితే అది చనిపోయిందా లేదా అని చూసేందుకు దాని దగ్గరకు వెళ్లాడు. అయితే చనిపోయినట్లు నటించిన ఆ దుప్పి అలెగ్జాండర్ పై ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రగాయాలతో హాస్పిటల్ పాలైన అతడు శనివారం తుదిశ్వాస విడిచాడు. 

ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్ స్టాంట్ ఖర్మ అంటే ఇదేనంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చంపుదామని వెళితె చచ్చిపోయాడని,ఒకరికి హాని తలపెట్టాలనుకునే వారికే హాని జరుగుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక నీతి కథ అని,జంతువులను వేటాడటం అన్యాయమంటూ మరికొందరూ కామెంట్స్ పెడుతున్నారు.