Meet Pigcasso : పంది గీసిన చిత్రాలు..డిమాండ్ మామూలుగా లేదుగా..

ఓ పంది ఎంచక్కా...చిత్రాలు గీసేస్తోంది. ఏంటీ ? పంది చిత్రాలు వేయడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ..అక్షరాల నిజం.

Meet Pigcasso : పంది గీసిన చిత్రాలు..డిమాండ్ మామూలుగా లేదుగా..

Meet Pigcasso

Artistic Pig  : ఓ పంది ఎంచక్కా…చిత్రాలు గీసేస్తోంది. ఏంటీ ? పంది చిత్రాలు వేయడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ..అక్షరాల నిజం. ఈ చిత్రాలకు భలే డిమాండ్ ఏర్పడుతోందంట. వేలం పెడితే..లక్షల రూపాయలు వస్తున్నాయంట. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటు చేసుకుంది.

Paintbrushes

పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ (Joanne Lefson) స్థానికంగా ఫామ్ శాంక్చ్యూరీ నిర్వహిస్తోంది. (sanctuary) నిర్వహిస్తున్నారు. జంతువలంటే ప్రేమ. 2016లో జంతు వధ శాలలో ఓ పందిని చూశారు. దానిని అక్కడి నుంచి రక్షించి..తాను నిర్వహిస్తున్న శాంక్చ్యూరీని తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత..పందిలో ఏదో ప్రతిభ ఉందని గుర్తించారు. దాని ముందట..పేపర్, పెయింటింగ్ కు సంబంధించిన రంగులు, బ్రష్ లు పెట్టారు. వెంటనే పది నోటితో బ్రష్ పట్టుకని బొమ్మలు గీయడం ప్రారంభించింది.

Pigs Are Very Smart

ఆ పందికి ‘పికాస్సో’ (Picasso’s) అని పేరు పెట్టింది. ఈ బొమ్మలను బాహ్య ప్రపంచానికి తెలియచేయాలని అనుకున్నారు జాన్నే. ఓ వెబ్ సైట్ ఓపెన్ చేసి పంది గీసిన బొమ్మలను అందులో పోస్టు చేశారు. దీంతో ఈ చిత్రాలకు ఫిదా అయ్యారు. వేలం పెట్టగా..యమ డిమాండ్ ఏర్పడింది. పికాస్సో గీసిన బొమ్మల ద్వారా..ఏకంగా $4,000 (2 లక్షల 89 వేల 768 రూపాయలు) వచ్చాయి. ఈ డబ్బును జంతు సంక్షేమ నిధికి విచ్చేస్తోంది జాన్నే లెఫ్సాన్. మొత్తానికి ఫిగాసో గీసిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారి..ఓ సెలబ్రెటీగా మారిపోయింది. కలర్స్ వల్ల దానికి ఎలాంటి ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు…సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం.