Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం మీద బొబ్బలు వంటివి మంకీపాక్స్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి పెద్దల్లో స్వల్ప లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది. పిల్లల్లో మాత్రం దీన్ని తీవ్రత అధికంగా ఉంటుంది.

monkeypox : కరోనా మహమ్మారి నుంచి కోలుకోకముందే మరో ముప్పు పొంచివుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మంకీపాక్స్ కలకలం రేపుతోంది. మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకివచ్చాయి. స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్ సోకే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నవారు 21 రోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలని బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ సూచించింది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారితో ఇంట్లో గానీ, వెలుపల గానీ సన్నిహితంగా మెలిగిన వారు తాము ఎప్పుడెప్పుడు? ఎక్కడెక్కడ? ఎవరెవరిని కలిసిన విషయాలను అధికారులకు తెలియజేయాలని తెలిపింది.
లైంగిక క్రియ ద్వారా కూడా వ్యాప్తి
అలాంటి వ్యక్తులు 21 రోజులపాటు బయట తిరగకూడదనీ, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాలబాలికలకు సమీపంగా వెళ్లరాదని వెల్లడించింది. ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి.. అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్ లకు పాకింది. బ్రిటన్ లో 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కోతుల్లోనే కనపించే ఈ వైరస్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా వైరస్ సోకుతుంది.
Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి.. లక్షణాలేంటి..?
స్వలింగ సంపర్కుల్లోనే అధిక కేసులు
ఇటీవల స్పెయిన్, బెల్జియంలో జరిగిన రెండు రేవ్ పార్టీల్లో పాల్గొన్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ డేవిడ్ హైమాన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్ లో కూడా ఇంతవరకు కనుగొన్న కేసుల్లో అధిక భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించాయి. అలాంటి వారితో లైంగిక క్రియ జరిపినా, పీపీఈ సూట్లు లేకుండా వారి దుప్పట్లు మార్చినా, ఇతరత్రా వెళ్లిన మంకీపాక్స్ వ్యాధి సోకుతుంది.
లక్షణాలు
అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం మీద బొబ్బలు వంటివి మంకీపాక్స్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి పెద్దల్లో స్వల్ప లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది. పిల్లల్లో మాత్రం దీన్ని తీవ్రత అధికంగా ఉంటుంది. సాధారణ జనాభాకు ఈ వ్యాధి వల్ల ప్రమాదం తక్కువేనని చెప్పవచ్చు. అయినప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండటం మంచిదని బ్రిటన్ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధాన అధికారి సూజన్ హాప్కిన్స్ సలహా తెలిపారు. మంకీపాక్స్ కరోనా లాంటిది కాదనీ, అది గాలి ద్వారా వ్యాపించదనీ, దాన్ని కట్టడి చేసే వ్యాక్సిన్స్ మనవద్ద ఉన్నాయని డాక్టర్ హైమాన్ చెప్పారు.
Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
మశూచి వ్యాక్సిన్ తో రక్షణ
మంకీపాక్స్ వ్యాధిగ్రస్తులకు సమీపంగా వెళ్లిన వారికి మశూచి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. లక్షణాలు కనిపించిన నాలుగు, ఐదు రోజుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నందున వారికి మంకీపాక్స్ నుంచి రక్షణ లభిస్తోంది. ప్రస్తుతానికి జనాభా మొత్తానికి మశూచి వ్యాక్సిన్స్ ఇవ్వడం లేదని బ్రిటన్ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధాన అధికారి సూజన్ హాప్కిన్స్ చెప్పారు. మశూచి వ్యాక్సిన్స్ మంకీపాక్స్ నుంచి 85 శాతం రక్షణ కల్పిస్తుండటం వల్ల అనేక దేశాలు ఆ వ్యాక్సిన్లను నిల్వచేస్తున్నాయి.
- Monkeypox : మంకీపాక్స్ పై అలర్టైన తెలంగాణ-21 రోజులు ఐసోలేషన్
- monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?
- Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
- Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
- Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
1Body Odor: శరీర దుర్గందం నుంచి విముక్తి కోసం
2Telangana Covid Terror Report : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
3Nellore Harass : నెల్లూరు జిల్లాలో దారుణం.. స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి..
4Assam floods: అసోంలో వరదలు.. ఒక్క రోజులో ఏడుగురు మృతి
5iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
6Gautam Adani: అదానీ 60వ పుట్టిన రోజు.. 60 వేల కోట్ల విరాళం
7Chandrababu Target Kodali Nani : టార్గెట్ కొడాలి నాని.. గుడివాడపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. స్కెచ్ ఇదే
8Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?
9Universities Recruitment : తెలంగాణ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
10Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్.. అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
-
Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Facebook : ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!
-
CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్
-
Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు
-
OnePlus Nord 2T : వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!
-
CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన
-
Brothers Suicide : తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య