Closest Comet To Earth : నేడే ఆకాశంలో అద్భుతం.. భూమికి అతి దగ్గరగా రానున్న తోకచుక్క

నేడు ఆకాశంలో అద్భుతం జరుగనుంది. ఇవాళ ఖగోళంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశ్వం నుంచి సుదూర ప్రాంతం నుంచి ఓ తోక చుక్క భూమికి చేరువగా వస్తోంది.

Closest Comet To Earth : నేడే ఆకాశంలో అద్భుతం.. భూమికి అతి దగ్గరగా రానున్న తోకచుక్క

comet

Closest Comet To Earth  : నేడు ఆకాశంలో అద్భుతం జరుగనుంది. ఇవాళ ఖగోళంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశ్వం నుంచి సుదూర ప్రాంతం నుంచి ఓ తోక చుక్క భూమికి చేరువగా వస్తోంది. Comet C/2022 E3 అని పిలిచే తోకచుక్క ఇవాళ భూమికి అతి సమీపంగా ప్రయాణించి కనువిందు చేయబోతుంది.

జనవరి నెల మొత్తం భూమికి ఆగ్నేయ దిశలో ప్రయాణించిన ఈ తోకచుక్క నేడు, రేపు భూమికి సమీపం నుంచి వెళ్లనుంది. సాధారణంగా తోకచుక్కలను అంచనా వేయలేమని.. అయితే ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మాత్రం ఈ తోకచుక్క చాలా ప్రకాశవంతంగా దర్శనమివ్వనుందని నాసా తెలిపింది.

Stunning Fireball: ఆకాశంలో వింత.. మండుతూ దూసుకువెళ్లిన ఖగోళ వస్తువు.. వీడియో

మరోవైపు ఓ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానుంది. ఇది చరిత్రలోనే తొలిసారి జరుగనుంది. ‘ఆస్టరాయిడ్-2023’ దక్షిణ అమెరికా మీదుగా భూ ఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ట్రక్కు బాక్స్ పరిమాణంలో ఉండే గ్రహ శకలం ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా పరిశోధకులు వెల్లడించారు.

అయితే, ఈ ఆస్టరాయిడ్ తో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ భూమిని ఢీ కొట్టినా.. 3.5 మీటర్ల నుంచి 8.5 మీటర్ల పరిమాణంలో ఉండే ఈ గ్రహ శకలం భూ వాతావరణంలో ఏదో ఒక చోట విచ్చిన్నం అవుతుందని పేర్కొన్నారు.