Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!

ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిండ్‌బ్లాంక్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తనకు ఓ కంపెనీ ఉంటే తాను ఇప్పట్నుంచే మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతానని ఆయన వ్యాఖ్యానించారు.

Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!

Economy

economic downturn : ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో మారిన పరిస్థితుల్లో ప్రపంచాన్ని కాటేయడానికి మాంద్యం మాటేసి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థికమాంద్యం అంచున ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ బ్యాంక్‌ గోల్డ్‌మెన్‌శాక్స్‌ సీనియర్‌ ఛైర్మన్‌ లాయిండ్‌బ్లాంక్‌ ఫెయిన్‌ హెచ్చరించారు. అమెరికా ప్రజలు, కంపెనీలు మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అమెరికా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిండ్‌బ్లాంక్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తనకు ఓ కంపెనీ ఉంటే తాను ఇప్పట్నుంచే మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతానని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపును ఆయన సమర్ధించారు. ఇప్పటివరకు ఫెడ్‌ ఈ అంశాన్ని సరిగానే డీల్‌ చేస్తోందన్నారు.

Corbevax Vaccine: రూ.590 తగ్గిన వ్యాక్సిన్ ధర.. ఇప్పుడు రూ.250 మాత్రమే

గోల్డ్‌మెన్‌శాక్స్‌ ఆర్థికవేత్తలు అమెరికా వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 2.6శాతం నుంచి 2.4శాతానికి తగ్గొచ్చని గోల్డ్‌మెన్‌శాక్స్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాది వృద్ధి 2.2శాతం నుంచి 1.6శాతానికి పడిపోతుందని హెచ్చరించింది. ఈ అంచనాలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ సంస్థ సీనియర్‌ ఛైర్మన్‌ మాంద్యం హెచ్చరికలు చేశారు.