Elon Musk: మస్క్‌కు షాకిచ్చిన ఉద్యోగులు.. వందలాది మంది రాజీనామా.. 21వరకు ట్విటర్ కార్యాలయాలు మూసివేత

గత బుధవారం మస్క్ ఉద్యోగులకు ఓ ఇమెయిల్ పంపించారు. అందులో .. ఉద్యోగులు అధిక సమయం కష్టపడాలని, వారానికి తక్కువలో తక్కువ 80గంటలు కష్టపడాలని సూచించాడు. గురువారం సాయంత్రంలోగా ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తిచేసి సమ్మతం తెలపాలని, లేకుంటే కంపెనీని విడిచిపెట్టాల్సి వస్తుందని ఉద్యోగులకు ఆ ఇమెయిల్‌లో మస్క్ సూచించాడు.

Elon Musk: మస్క్‌కు షాకిచ్చిన ఉద్యోగులు.. వందలాది మంది రాజీనామా.. 21వరకు ట్విటర్ కార్యాలయాలు మూసివేత

Elon Musk

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్ననాటినుంచి కీలక మార్పులు చేస్తున్నారు. తొలిదశలోనే సంస్థలోని కీలక విభాగాల్లో సగం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న మస్క్.. ఇటీవల 4వేల మందికిపైగా ఔట్ సోర్సింగ్ వర్కర్లను తొలగించాడు. ట్విటర్ నష్టాలను భర్తీచేసేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వస్తుందని మస్క్ వివరించాడు. మరోవైపు ట్విటర్‌లో బ్లూటిక్, ఇతర విషయాల్లో తొందరపాటు నిర్ణయాలతో మస్క్ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Twitter Blue Tick: ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ పున: ప్రారంభ తేదీని వెల్లడించిన మస్క్..

బుధవారం మస్క్ ఉద్యోగులకు ఓ ఇమెయిల్ పంపించారు. అంతకుముందు ఉద్యోగులు అధిక సమయం కష్టపడాలని, వారానికి తక్కువలో తక్కువ 80గంటలు కష్టపడాలని సూచించిన మస్క్.. బుధవారం ఉద్యోగులకు పంపించిన ఇమెయిల్‌లో ‘చాలా హార్డ్ కోర్’ గా ఉండాలని సూచించారు. అంటే  ఎక్కువ గంటలు ఒత్తిడిని ఎదుర్కొని పనిచేయాలని,  గురువారం సాయంత్రంలోగా  తమ సమ్మతం తెలపాలని మస్క్ సూచించాడు. ఒకవేళ సమ్మతి తెలపని పక్షంలో మూడు నెలల గడువుతో ఉద్యోగాల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆ ఇమెయిల్‌లో మస్క్ హెచ్చరికలు సైతం జారీ చేశాడు. మస్క్ తీరుతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలోని చాలా మంది ఉద్యోగులు ‘హార్డ్‌కోర్ వర్క్’ అల్టిమేటం తర్వాత వందలాది మంది తమ రాజీనామాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

Musk Ultimatum: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పిన మస్క్.. అలా చేయకపోతే ఇక ఎవరైనా ఇంటికేనట!

ఉద్యోగుల వరుస రాజీనామాల అనంతరం ట్విటర్ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తామని, నవంబర్ 21 వరకు బ్యాడ్జ్ యాక్సెస్‌ను నిలిపివేస్తున్నట్లు ఉద్యోగులకు సంస్థ నుంచి ఒక ఇమెయిల్ వెళ్లింది. కంపెనీ నిబంధనల ప్రకారం.. ఎవరూ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయొద్దని ఉద్యోగులను కోరినట్లు బ్లూమ్‌బెర్గ పేర్కొంది.  అయితే, తన కఠిన నిర్ణయాలకు ఇంతమంది ఉద్యోగులు వైదొలిగేందుకు సిద్ధమవుతారని మస్క్ ఊహించలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసే సమయానికి 7,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల మస్క్ 50శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. తాజాగా ఉద్యోగుల రాజీనామాల నిర్ణయంతో ట్విటర్ 88శాతం ఉద్యోగులను కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మస్క్ ఉద్యోగుల రాజీనామాల అస్త్రంతో వెనక్కు తగ్గుతారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.