ICC Announced FTP : రాబోయే నాలుగేళ్లకు ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్‌లు

రాబోయే నాలుగేళ్లకు ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్‌లు పురుషుల క్రికెట్‌కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్‌ల షెడ్యూల్‌ను గురువారం(ఆగస్టు 17,2022) విడుదల చేసింది.

ICC Announced FTP : రాబోయే నాలుగేళ్లకు ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్‌లు

ICC Announced FTP

ICC Announced FTP : రాబోయే నాలుగేళ్లకు ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్‌లు పురుషుల క్రికెట్‌కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్‌ల షెడ్యూల్‌ను గురువారం(ఆగస్టు 17,2022) విడుదల చేసింది.

గతంతో పోలిస్తే కొత్త ఎఫ్‌టీపీలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌ల సంఖ్యలు గణనీయంగా పెరిగాయి. 2019-23 ఎఫ్‌టీపీలో అన్ని జట్లు కలిపి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడాల్సి ఉండగా.. ఐసీసీ 2023-27లో వీటి సంఖ్య మరింత పెంచింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నాలుగేళ్ల కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20లు ఉన్నాయి.

Asia Cup 2022: మహ్మద్ నబీ సారథ్యంలో ఆసియా కప్‌కు.. 17మంది సభ్యులతో జట్టును ప్రకటించిన ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు

మొత్తంగా నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈ సైకిల్‌లో పురుషుల క్రికెట్ జట్లు 87 మ్యాచ్‌లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేళ్లలోనే ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ కూడా జరుగనున్నాయి.

భారత్ విషయానికొస్తే.. 2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్‌లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికాలు భారత పర్యటనకు వస్తాయి. భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సఫారీ పర్యటనలకు వెళ్లనుంది.