Major Crowd Disasters In World: విషాదం మిగిల్చిన హాలోవీన్ వేడుక.. ప్రపంచ వ్యాప్తంగా గతంలో చోటుచేసుకున్న అతిపెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే..

దక్షిణ కొరియా సియోల్ రాజధానిలో హాలోవీన్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 146 మంది మరణించగా, 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే, గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పెద్ద ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. వందలాది మంది మరణించారు. గతంలో చోటుచేసుకున్న ఘటనలను ఓసారి పరిశీలిద్దాం.

Major Crowd Disasters In World: విషాదం మిగిల్చిన హాలోవీన్ వేడుక.. ప్రపంచ వ్యాప్తంగా గతంలో చోటుచేసుకున్న అతిపెద్ద తొక్కిసలాట ఘటనలు ఇవే..

S. Korea Halloween stampede

Major Crowd Disasters In World: దక్షిణ కొరియా సియోల్ రాజధానిలో హాలోవీన్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 146 మంది మరణించగా, 150 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. తొక్కిసలాటలో ఊపిరాడక పోవటం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. అయితే, గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పెద్ద ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. వందలాది మంది మరణించారు.  గతంలో చోటుచేసుకున్న ఘటనలను ఓసారి పరిశీలిద్దాం.

South Korea: దక్షిణ కొరియా తొక్కిసలాటలో 149కి పెరిగిన మృతుల సంఖ్య.. మరో 150 మందికి గాయాలు

– 1980 జనవరి 20న కొలంబియాలోని సిన్సిలెజోలో జరిగిన బుల్ ఫైట్‌లో తాత్కాలికంగా నాలుగు అంతస్తుల చెక్క స్టేడియం కూలి 200 మంది ప్రేక్షకులు మరణించారు.

◊ 1990 జూలై 2న సౌదీ అరేబియాలో వార్షిక హజ్ సమయంలో 1,426 మంది ముస్లిం యాత్రికులు, ప్రధానంగా ఆసియా నుండి, మక్కా నుండి మినాకు దారితీసే పొడవైన పాదచారుల సొరంగంలో, చుట్టుపక్కల మరణించారు.

◊ 1994 మే 23న హజ్ యాత్రికుల రద్దీ కారణంగా 270 మంది ముస్లిం యాత్రికులు మరణించారు.

◊ 1994 నవంబరు 23న భారత్‌లోని నాగ్‌పూర్‌లో రాజకీయ నిరసన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 113 మంది మరణించారు.

◊ 1998 ఏప్రిల్ 9న మక్కాలోని ఒక వంతెనపై యాత్రికుల మధ్య తోపులాట జరిగి 118 మంది హజ్ యాత్రికులు మరణించారు.

◊ 2001 మే 9న ఘనా రాజధాని అక్రాలో ఒక స్టేడియంలో ఆందోళనకారుల గుంపుపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 120 మందికి పైగా మరణించారు.

◊ 2003 ఫిబ్రవరి 20న రోడ్ ఐలాండ్‌లోని వార్విక్‌లోని స్టేషన్ నైట్‌క్లబ్‌లో గ్రేట్ వైట్ కచేరీలో మంటలు చెలరేగడంతో తప్పించుకొనే క్రమంలో తొక్కిసలాట జరిగి 100 మంది మరణించారు.

◊ 2004 ఫిబ్రవరి 1న మక్కా సమీపంలోని జమారత్ వంతెన వద్ద హజ్ ఆచారం సమయంలో జరిగిన తోపులాటలో 251 మంది మరణించారు.

◊ 2005 జనవరి 25న మహారాష్ట్రలోని మంధ్రాదేవి దేవాలయం దగ్గర హిందూ యాత్రికుల మధ్య తోపులాటలో 265 మంది మరణించారు.

◊ 2005 ఆగష్టు 31న మతపరమైన ఊరేగింపు సందర్భంగా వంతెనపై రెయిలింగ్ కూలిపోవడంతో బాగ్దాద్‌లో కనీసం 640 మంది షియా ముస్లిం యాత్రికులు మరణించారు.

◊ 2006 జనవరి 12న మక్కా సమీపంలో హజ్ వేడుకలో ముస్లిం యాత్రికుల మధ్య జరిగిన తోపులాటలో 345 మంది మరణించారు.

◊ 2008 సెప్టెంబరు 30న భారత్‌లోని జోధ్‌పూర్‌ వద్ద ఓ దేవాలయంలో వేలాది మంది హిందూ యాత్రికుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 168 మంది మరణించారు.

◊ 2010 నవంబరు 22న కంబోడియా రాజధాని నమ్ పెన్‌లో జరిగిన ఒక ఉత్సవంలో జరిగిన తోపులాటలో 340మందికి పైగా మరణించారు.

◊ 2013 జనవరి 27న బ్రెజిల్‌లోని శాంటా మారియాలోని కిస్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 200 మందికి పైగా మరణించారు.

◊ 2015 సెప్టెంబరు 24న సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో కనీసం 2,411 మంది ముస్లిం యాత్రికులు చనిపోయారు.

◊ 2022 అక్టోబరు 1న ఇండోనేషియా సాకర్ మ్యాచ్ తర్వాత హింస చెలరేగడంతో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో 125 మంది మరణించారు.

◊ 2022 అక్టోబరు 29న దక్షిణ కొరియాలోని సియోల్‌లో హాలోవీన్ ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 146 మంది మరణించారు. మరో 150 మంది గాయపడ్డారు.