Joe Biden: జో బైడెన్ మనుమరాలి వివాహం.. శ్వేతసౌధం చరిత్రలోనే తొలిసారి..

వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. నవోమి, పీటర్ నీల్ వివాహం శ్వేతసౌధంలో అధ్యక్షుడి మనవరాలు వధువుగా జరిగే మొదటి వివాహం అవుతుంది. గతంలో అధ్యక్షుడి కుమార్తెల వివాహాలు జరిగాయి.

Joe Biden: జో బైడెన్ మనుమరాలి వివాహం.. శ్వేతసౌధం చరిత్రలోనే తొలిసారి..

Joe Biden's granddaughter

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు నవోమి బైడెన్ వివాహం శ్వేతసౌధంలో జరగనుంది. అందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 19న నవోమి బైడెన్ తన స్నేహితుడు పీటర్ నీల్‌ను వివాహం చేసుకోనుంది. నవోమికి 28యేళ్లుకాగా, పీటర్ నీల్ కు 24యేళ్లు. తనకంటే నాలుగేళ్ల చిన్నవయస్కుడిని నవోమి బైడెన్ వివాహం చేసుకోబోతుంది. వీరి వివాహంతో వైట్ హౌస్ చరిత్రలో 19వ పెళ్లి అవుతుంది.

Pawan Kalyan : నాన్నలాగే కూతురు అంటూ.. ఆద్య వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ఖుషి అవుతున్న పవన్ ఫ్యాన్స్..

వైట్ హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రకారం.. నవోమి, పీటర్ నీల్ వివాహం శ్వేతసౌధంలో అధ్యక్షుడి మనవరాలు వధువుగా జరిగే మొదటి వివాహం అవుతుంది. గతంలో అధ్యక్షుడి కుమార్తెల వివాహాలు జరిగాయి. న్యూయార్క్ నగరం వైట్ హౌస్‌లో వీరిద్దరు కొన్ని నెలలుగా కలిసే ఉంటున్నారని స్థానిక మీడియా తెలిపింది. నవోమీ బైడెన్ ఒక న్యాయవాది. ఆమె తండ్రి హంటర్ బైడెన్. నీల్ ఇటీవలే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం న్యాయ పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు.

‘World’s Most Expensive Beer’ : ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన బీరు బాటిల్ .. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!

నవోమి, పీటర్‌ నీల్‌ నాలుగేళ్ల క్రితం కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో నాలుగేళ్ల నుంచి వీరు సహజీవనం చేస్తున్నారు. తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహంపై ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ.. తన మనవరాలు తన వివాహాన్ని ప్లాన్ చేసుకోవడం, తన భాగస్వామినికి తనే ఎంపిక చేసుకోవటం జరిగింది. నవోమి చాలా ఆనందంగా ఉందని తెలిపింది.