Sri Lanka Crisis : శ్రీలంకలో రాజపక్సేల ఛాప్టర్‌ క్లోజ్‌!..తరిమికొట్టిన లంక ప్రజలు

ఒకప్పుడు అభివృద్ది కాంతులతో కళకళలాడిన లంక.. ఇప్పుడు నిత్యావసరాల లేని దుస్థితికి చేరిందంటే రాజపక్సే కుటుంబ పాలన ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టూరిస్టులతో కిక్కిరిసిన ద్వీపం.. ఇప్పుడు ఆకాలి బాధలకు కేరాఫ్‌గా మారిపోయింది.

Sri Lanka Crisis : శ్రీలంకలో రాజపక్సేల ఛాప్టర్‌ క్లోజ్‌!..తరిమికొట్టిన లంక ప్రజలు

Sri Lamka

Rajapakses : దశాబ్దాల పాటు శ్రీలంక ప్రజల్ని ఏలిన రాజపక్సేల ఛాప్టర్‌ లాస్ట్ పేజీకి చేరుకుంది. కొంతకాలం క్రితం వరకు తమకు తిరుగేలేదని ఆహంకారంతో లంక ప్రజల్ని పాలించిన రాజపక్సే కుటుంబం.. ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునే సమయం వచ్చేసింది..! లంక ప్రజలే వాళ్లను తరిమితరిమి తన్నారు. మూడు నెలల క్రితమే అధ్యక్షుడు గొటబాయ మినహా మిగిలిన రాజపక్సే కుటుంబసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినా.. గొటబాయ మాత్రం పదవి పట్టుకొని వేళాడారు.

తనది మునిగిపోయే ఓడ అని తెలిసినా.. చివరి వరకు గాలి వానలో పడవ ప్రయాణం కొనసాగించారు. అయితే సముద్రమంత జనాగ్రహం కట్టలు తెంచుకొని అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ప్రాణభయంతో పారిపోయిన గొటబాయ.. ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రాజకీయాల్లో రాజపక్సే ఫ్యామిలీ కథ కంచికి చేరినట్లైంది. మరో మూడు రోజుల్లో ఆయన అధికారికంగా రాజీనామా చేయనుండడంతో.. ఇక రాజపక్సేల రాజకీయ కథా చిత్రామ్‌ ముగిసినట్లే లెక్క.

Sri Lanka Crisis: గొటబాయ విదేశాలకు పారిపోయాడా? అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే ఆ దేశ రాజ్యాంగం ఏం చెబుతుంది!

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. రాజపక్సే ఫ్యామిలీలోని 18మంది అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని.. యావత్‌ శ్రీలంకను చిమ్మచీకట్లోకి నెట్టేశారు. రాజపక్సే మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు, బంధువుల దగ్గరే ఉండేవి. ప్రజాస్వామ్యాన్నీ రాజుల కాలం నాటి వంశాల రాజ్యంగా మార్చిన నీచ చరిత్ర రాజపక్సేలది..! ప్రజల ఎన్నుకున్నారు కదా అని.. ఇష్టారాజ్యంగా.. తలతోక లేని నిర్ణయాలతో ప్రజల కడుపు మీదే కొట్టిన పాపం రాజపక్సే కుటుంబానిది.

ఒకప్పుడు అభివృద్ది కాంతులతో కళకళలాడిన లంక.. ఇప్పుడు నిత్యావసరాల లేని దుస్థితికి చేరిందంటే రాజపక్సే కుటుంబ పాలన ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టూరిస్టులతో కిక్కిరిసిన ద్వీపం.. ఇప్పుడు ఆకాలి బాధలకు కేరాఫ్‌గా మారిపోయింది. రాజపక్సే ఫ్యామిలీ తప్పుడు నిర్ణయాలకు లంక నరక కూపంలో కూరుకుపోయింది. ప్రజలు తిండీతిప్పలు లేక అలమటిస్తున్నారు. పాలు, మంచినీళ్లు కూడా కొనుక్కోలేక.. ఎలా బతకాలో అర్థంకాక రోడ్లపైకి వస్తున్నారు.

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలో ఆర్మీ..శాంతియుత పరిష్కారానికి ప్రయత్నాలు

తమ దుస్థితికి కారణమైన రాజపక్సే కుటుంబం అంతుచూసేందుకు ఏకంగా అధ్యక్ష భవనంలోకే చొచ్చుకొచ్చారంటే అక్కడి ప్రజల ఆగ్రహం ఎలా ఉందో క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. దొరికితే ఏం చేస్తారో అన్న భయంతో గొటబాయ పారిపోయాడు.. మూడు నెలల క్రితం ఆర్మీ అండతో నిరసనకారుల నుంచి అప్పటి ప్రధాని మహింద తప్పించుకుంటే.. ఇప్పుడు నేవీ సాయంతో గొటబాయ ప్రాణాలను దక్కించుకున్నారు. శ్రీలంక దళాలు రాజపక్సే కుటుంబానికి రక్షణగా ఉండి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా రాజపక్సేలకు కష్టమే.

శ్రీలంక ప్రజల్లో తిరుగులేని ఆదరణ తెచ్చుకున్న రాజపక్సే కుటుంబం తమకు తిరుగులేదని విర్రవీగింది. ప్రతిపక్షాలను అణిచివేసింది. ప్రజలని ఆకట్టుకోవడానికి ఉచితాలిచ్చింది. దేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేసింది. చివరికి ఏమైంది..? ప్రజలు తిరగబడ్డారు.. ఆధునిక ప్రపంచంలో ఏ దేశ ప్రజలు ఒక కుటుంబాన్ని ఇంతలా ద్వేషించి ఉండరేమో అని అందరూ అనుకునే అంతలా తిరుగుబాటు చేశారు. రాజపక్సే కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాల నుంచి దూరం చేసేలా తరిమితరిమికొట్టారు.