Seoul Halloween Stampede: హాలోవీన్ తొక్కిసలాటలో మృతుల బూట్లను భద్రపర్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

దక్షిణ కొరియా హాలోవీన్ వేడుకలో తొక్కిసలాటలో మృతుల కాళ్లకున్న బూట్లు, వారు మరణించిన సమయంలో వారి వద్ద ఉన్న వస్తువులను సేకరించి వాటిపై పేర్లురాసి మరీ బ్యాడ్మింటన్ కోర్టులో వరుస క్రమంలో భద్రపర్చారు. వీటన్నింటి బరువు సుమారు 1.5 టన్నులు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Seoul Halloween Stampede: హాలోవీన్ తొక్కిసలాటలో మృతుల బూట్లను భద్రపర్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

Seoul Halloween Stampede

Seoul Halloween Stampede: దక్షిణ కొరియా హాలోవీన్ వేడుకలో తొక్కిసలాట జరిగి 154 మందికిపైగా మృతి చెందగా, 133మందికి గాయాలయ్యాయి. హలోవీన్ వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగింది. చాలామంది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కాగా మరికొందరు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. తొక్కిసలాట సందర్భంగా మృతుల బూట్లు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే వాటిని సేకరించిన పోలీసులు రాజధాని సియేల్ లోని బ్యాడ్మింటన్ కోర్టులో భద్రపర్చారు.

Seoul Halloween Stampede : తీవ్ర విషాదం.. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట, 59మందికి గుండెపోటు

మృతుల కాళ్లకున్న బూట్లు, వారు మరణించిన సమయంలో వారి వద్ద ఉన్న వస్తువులను సేకరించి వాటిపై పేర్లురాసి మరీ బ్యాడ్మింటన్ కోర్టులో వరుస క్రమంలో భద్రపర్చారు. వీటన్నింటి బరువు సుమారు 1.5 టన్నులు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అయితే వాటిని మృతుల కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, బంధువులు తీసుకెళ్లేలా అందుబాటులో ఉంచారు.

Clothes collected from the scene of a deadly accident following

Clothes collected from the scene of a deadly accident following

Seoul Halloween Stampede: సియోల్‌ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి జైశంకర్.. క్లిష్ట సమయంలో అండగా ఉంటామని వెల్లడి..

జిమ్‌లో భద్రపర్చిన వస్తువుల్లో దాదాపు 250 జతల బూట్లు, ఇతర వస్తువుల పోలీసులు సేకరించిన వస్తువుల్లో ఉన్నాయి. అంతేకాక వీటిలో కోట్లు, సినిమా క్యారెక్టర్ కాస్ట్యూమ్‌లు, అలాగే హ్యాండ్‌బ్యాగ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్ ఇయర్‌పీస్, కొన్ని పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. వీటిని తీసుకొనేందుకు మృతుల కుటుంబ సభ్యులు అనేక మంది వచ్చారు. వారివారి మృతుల వస్తువులను తీసుకొని కన్నీరుమున్నీరయ్యారు.