Richest Cats: ప్రముఖ గాయని పెంపుడు పిల్లికి రూ.800కోట్ల ఆస్తులు..! ఎలా సంపాదించిందో తెలుసా?

ఆల్ అబౌట్ క్యాట్స్ యొక్క ఇటీవలి నివేదికలో.. ప్రపంచంలోని అత్యంత సంపన్న పిల్లి నాలా క్యాట్. దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే 4.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రెండో స్థానంలో ఒలివియా బెన్సన్ ఉంది. ఆ తరువాతి స్థానంలో దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్, చానెల్ యజమాని కార్ల్ లాగర్ ఫెల్డ్ పెంపుడు పిల్లి చాపెట్ బిర్మాన్ నిలిచింది.

Richest Cats: ప్రముఖ గాయని పెంపుడు పిల్లికి రూ.800కోట్ల ఆస్తులు..! ఎలా సంపాదించిందో తెలుసా?

Olivia Benson

Richest Cats: ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్లు ఎంతో మంది ఉంటారు. ఈ జాబితాలో టాప్10 స్థానాల్లో భారతీయులుకూడా ఉన్నారు. వారి ఆస్తులు వేలకోట్లలో ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే.. కానీ పిల్లులకు కోట్లలో ఆస్తులు ఉంటాయని మీకు తెలుసా? అవి సొంతంగా తమ ఆస్తులను సంపాదించుకుంటాయని తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ పిల్లులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం తెలుసుకునే బిలియనీర్ పిల్లి ప్రపంచ వ్యాప్తంగా పిల్లల జాతికి చెందిన బిలియనీర్ జాబితాలో రెండో స్థానంలో ఉంది.

Viral Video: పులి వెనుక పరిగెడుతూ మొబైల్‌లో వీడియో తీసిన వ్యక్తి

తన పాటతో అన్నివయస్సులవారిని ఉర్రూతలూగించే అమెరికాకు చెందిన ప్రముఖ గాయని టేలర్ స్విప్ట్ అందరికీ సుపరిచితమే. ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. ఫార్బ్స్ అంచనా ప్రకారం.. ఆమె ఆస్తులు విలువ 570 మిలియన్ల డాలర్లు. అంటే అక్షరాల రూ. 4,700 కోట్లు. స్విప్ట్‌కు పెంపుడు పిల్లి ఉంది. తన యాజమాని ఆస్తులను చూసి ఆ పెంపుడు పిల్లి ఏమనుకుందో.. తాను సంపాదిస్తూ తనతోటి పిల్లులకు పోటీగా నిలుస్తుంది. ఆ పిల్లిపేరు బిలివియా బెన్సన్. దాని ఆస్తుల విలువ 97 మిలియన్ల డాలర్లు. పెంపుడు జంతువుల రిచ్ లిస్ట్‌ (అన్ని జంతువులు) లో తాజాగా బిలివియా బెన్సన్ మూడో స్థానంలో నిలిచింది.

Viral video: మనిషిని హత్తుకున్న సింహం.. వీడియో చూసి ‘వామ్మో’ అంటున్న నెటిజన్లు

బిలివియా బెన్సన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. దీనికి ప్రత్యేకంగా ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయంటే అతిశయోక్తికాదు. ప్రముఖంగా పెంపుడు జంతువుల ఆస్తులను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అంచనా వేస్తారు. ఈ బిలియనీర్ పిల్లికి మాత్రం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలేదు. ఒలివియా 2014 నుంచి టైలర్‌తోనే ఉంది. గాయని టైలర్ స్విప్ట్ మ్యూజిక్ వీడియోలు, యాడ్స్‌లో తరచూ ఈ బిలియనీర్ పిల్లి కనిపిస్తుంది.