New Zealand: న్యూజీలాండ్‌లో 16ఏళ్లకే ఓటు హక్కు.. సుప్రీంకోర్టు సూచనలతో ప్రభుత్వం అడుగులు ..

ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఓటింగ్ వయస్సు తగ్గింపునకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల చట్టంలో మార్పులకు పార్లమెంట్‌లో 75% మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం శాసనసభ ముసాయిదాను రూపొందించి పార్లమెంటు ముందు ఉంచుతుందని ఆమె తెలిపింది.

New Zealand: న్యూజీలాండ్‌లో 16ఏళ్లకే ఓటు హక్కు.. సుప్రీంకోర్టు సూచనలతో ప్రభుత్వం అడుగులు ..

New Zealand

New Zealand: కనీస ఓటింగ్ వయోపరిమితి 18ఏళ్లు వివక్షాపూరితమని న్యూజీలాండ్ సుప్రింకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కనీస వయోపరిమితి తప్పనిసరిగా తగ్గించాలా వద్దా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యూజీలాండ్ పార్లమెంట్ కు సుప్రీంకోర్టు సూచించింది. కనీస ఓటింగ్ వయోపరిమితిని 16 ఏళ్లకు తగ్గించాలని 2020లో దాఖలైన కేసులో న్యూజీలాండ్ సుప్రీంకోర్టు తాజా తీర్పును వెల్లడించింది.

PM Jacinda livestrm : లైవ్ లో మాట్లాడుతున్నన్యూజిలాండ్ ప్రధాని జెసిండా..‘మమ్మీ’అంటూ వచ్చిన కూతురు..ఇంట్రెస్టింగ్ సీన్

మీడియా నివేదికల ప్రకారం.. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుత కనీస వయోపరిమితి 18ఏళ్లకే ఓటు హక్కుల బిల్లుకు విరుద్ధంగా ఉందని గుర్తించింది. హక్కుల బిల్లు వ్యక్తులు 16 సంవత్సరాల వయస్సు నుండి స్వేచ్ఛగా ఉండటానికి అనుమతిస్తుంది, అందుకే ప్రస్తుత ఓటింగ్ వయోపరిమితి 18 వివక్షతతో కూడుకున్నదని కోర్టు పేర్కొంది. ప్రస్తుత వయో పరిమితిని మార్చడం పార్లమెంటు కట్టుబడి ఉండనప్పటికీ, ఈ విషయం ఇప్పుడు చర్చకోసం పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది. చర్చను పార్లమెంటరీ ఎంపిక కమిటీ తదుపరి సమీక్షిస్తుంది.

Trump Account Reinstated: డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ రీస్టోర్‭ చేసిన ట్విట్టర్‭.. ట్రంప్, మస్క్‭లపై నెటిజెన్ల ఫన్నీ ట్రోల్స్

ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఓటింగ్ వయస్సు తగ్గింపునకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్నికల చట్టంలో మార్పులకు పార్లమెంట్‌లో 75% మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం శాసనసభ ముసాయిదాను రూపొందించి పార్లమెంటు ముందు ఉంచుతుందని ఆమె తెలిపింది. మేక్ ఇట్ 16 అనే అడ్వకేసీ గ్రూప్ కో-డైరెక్టర్ కేడెన్ టిప్లర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని, వయోపరిమితిని 16ఏళ్లకు తగ్గించేందుకు పార్లమెంటు తప్పనిసరిగా ఓటు వేయాలని అన్నారు. ఇదిలాఉంటే బ్రెజిల్‌, ఆస్ట్రియా, క్యూబా వంటి దేశాల్లో 18ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న వారికి ఓటు వేసే హ‌క్కుల్ని క‌ల్పిస్తోంది.