Dwayne Johnson: అమ్మాయిలా మారిన హాలీవుడ్ హీరో.. కూతుళ్లు భలేపనిచేశారే.. వీడియో వైరల్

‘ది రాక్’ గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.. నిత్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఎక్కువగా ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో డ్వేన్ జాన్సన్ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అతను తన కూతుళ్లు చేసిన పనికి అమ్మాయిలా కనిపించాడు.

Dwayne Johnson: అమ్మాయిలా మారిన హాలీవుడ్ హీరో.. కూతుళ్లు భలేపనిచేశారే.. వీడియో వైరల్

Johnson's Daughters

Dwayne Johnson: తండ్రీ కూతుళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైంది. ఇంట్లో కూతుళ్లు ఉంటేచాలు ఆ ఇల్లు సందడిగా మారుతుంది. చిలిపి అల్లరి, విచిత్ర వేషధారణలతో సందడి చేస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గామారింది. ఈ వీడియోలో హాలీవుడ్ ప్రముఖ హీరో డ్వేన్ జాన్సన్ అమ్మాయిగా మారాడు. క్రిస్మస్ సందర్భంగా కూతుళ్లు చేసిన పనికి అమ్మయిలా మారాల్సి వచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బైకుపై వేగంగా వెళ్తుండగా అడ్డువచ్చిన పులి.. వీడియో వైరల్

‘ది రాక్’ గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు డ్వైన్ జాన్సన్.. నిత్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఎక్కువగా ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో డ్వైన్ జాన్సన్ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తన ఇద్దరు కూతుళ్లు (చిన్న పిల్లలు) క్రిస్మస్ సందర్భంగా జాన్సన్ కు మేకప్ వేస్తూ కనిపించారు. అందమైన జడతో పాటు ముఖానికి మేక్ రంగులు వేశారు. దీంతో హాలీవుడ్ ప్రముఖ హీరో కాస్తా యంగ్ అమ్మాయిలా మారిపోయాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Dwayne Johnson (@therock)

 

ఈ వీడియోలో .. జాన్సన్‌కు మేకప్ వేస్తున్న సమయంలో తన కుమార్తె జాస్మిన్‌ను పలు ప్రశ్నలు అడుగుతాడు. మేకప్ చేస్తే ముఖంపై అంత గట్టిగా నొక్కాలా? అని ప్రశ్నిస్తాడు. జాస్మిన్ క్యూట్ గా స్పందిస్తూ.. అవును, ఇది మేకప్ లో ఓ భాగం అని బదులిస్తుంది. ఇలా సరదా సంభాషణలతో మేకప్ పూర్తవుతుంది. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సుమారు 62లక్షల మంది వీక్షించారు.