SpaceX : భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక.. నలుగురు యాత్రికులు, మూడు రోజులు అంతరిక్షంలో

అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక భూమికి చేరింది.

SpaceX : భూమికి చేరిన స్పేస్ ఎక్స్ వాహక నౌక.. నలుగురు యాత్రికులు, మూడు రోజులు అంతరిక్షంలో

Space X

SpaceX carrier landed safely  : అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక భూమికి చేరింది. నలుగురు యాత్రికులతో 3 రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్‌ ‘స్పేస్‌ క్యాప్సుల్‌’ సురక్షితంగా భూమికి చేరింది.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటలకు ఫ్లోరిడాలోని సముద్రంలో దిగింది. గంట తర్వాత యాత్రికులు అందులో నుంచి చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు. దీనిని స్పేస్‌ ఎక్స్‌ యూట్యూబ్‌ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Nasa Space Masala : అంతరిక్ష కేంద్రంలో మసలా దినుసుల సాగు…త్వరలో అందుబాటులోకి స్పేస్ మసాలా

సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్ (29)‌, టీవీ నటి సియాన్ ప్రోక్టర్ (51), ఏరోస్పేస్‌ డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ (42), జారెడ్ ఐజాక్‌మన్ (38) స్పేస్‌ ఎక్స్‌ వాహక నౌక డ్రాగన్ ‘స్పేస్ క్యాప్సూల్‌’ ద్వారా బుధవారం రాత్రి ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లారు.

ఈ అంతరిక్ష వాహకనౌకలో టీవీ నటి సియాన్ ప్రోక్టర్ (51), ఏరోస్పేస్‌ డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ (42), జారెడ్ ఐజాక్‌మన్ (38), సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్ (29)‌ బుధవారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పయనమయ్యారు.

‘ఇన్​స్పిరేషన్-4’ అనే ఈ మిషన్​లో భాగంగా 540 కిలో మీటర్ల ఎత్తులో మూడు రోజుల పాటు గడిపారు. స్పేస్ ఎక్స్ నిర్వహించిన మొదటి ప్రైవేట్ రైడ్ ఇదే కావడం గమనార్హం.