Sri Lanka : రోజుకు 10 గంటలు కరెంట్ కట్

బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల 750 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడిందని పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ తెలిపింది.

Sri Lanka : రోజుకు 10 గంటలు కరెంట్ కట్

Sri Lanka

Sri Lanka power cut : శ్రీలంక ప్రభుత్వం కరెంటు కోత సమయాన్ని రోజుకు 7 గంటల నుంచి 10 గంటలకు పెంచింది. జల విద్యుదుత్పత్తి కోసం ఇంధనం అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచే ఈ కోతలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. విదేశీ మారకద్రవ్యం కొరత వల్ల దేశంలో ఆర్థిక, ఇంధన సంక్షోభం నెలకొనడంతో శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి.

శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంధనం కొరత వెంటాడుతోంది. దీనికి తోడు కరెంటు కోతలు ప్రజలను అనేక అవస్థలకు గురి చేస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యం కొరత వల్ల దిగుమతులపై ఆంక్షలను అమలు చేస్తున్నారు. మార్చి నెల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా రోజుకు 7 గంటలపాటు విద్యుత్తు కోత అమలవుతోంది.

Srilanka Economic Crisis : గుడ్డు 35 రూపాయలు… పెట్రోల్ రూ.283….శ్రీలంక సంక్షోభం

బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల 750 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడిందని పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ తెలిపింది. మరోవైపు ఇవాళ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరవద్దని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ వాహనదారులను కోరింది.

సంస్థ కొనుగోలు చేసిన ఇంధనానికి చెల్లింపులు ఇంకా పూర్తికాలేదని.. అందుకే ఇంధనం సరఫరా చేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే పోర్టుకు చేరుకున్న ఇంధనానికి శుక్రవారం చెల్లింపులు జరగొచ్చని తెలిపింది. ఆ తర్వాతే వాహనదారులకు ఇంధనం సరఫరా చేయగలమని వెల్లడించింది.