sri lanka: తుపాకుల‌కు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న బామ్మ‌

తుపాకులు, లాటీలు పట్టుకుని వ‌చ్చాయి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు. వారిని చూసి ఆందోళ‌న‌కారులు పారిపోతున్నారు. అయితే, ఓ బామ్మ మాత్రం ఎలాంటి భ‌యం లేకుండా నిల‌బ‌డింది. ఆందోళ‌న‌కారులు అంద‌రూ శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్నార‌ని, వారి చేతుల్లో రాళ్ళు కూడా లేవ‌ని అరిచింది. ఆమె చూపుతోన్న ధైర్యానికి ఆశ్చ‌ర్యపోవ‌డం అంద‌రివంతు అయింది. శ్రీ‌లంక‌లో జీన్ ప్రిమ్రోస్ నాథానీల్స్జ్ అనే 90 ఏళ్ళ బామ్మ చేస్తోన్న పోరాటం ఇది.

sri lanka: తుపాకుల‌కు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న బామ్మ‌

New Project (30)

sri lanka: తుపాకులు, లాటీలు పట్టుకుని వ‌చ్చాయి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు. వారిని చూసి ఆందోళ‌న‌కారులు పారిపోతున్నారు. అయితే, ఓ బామ్మ మాత్రం ఎలాంటి భ‌యం లేకుండా నిల‌బ‌డింది. ఆందోళ‌న‌కారులు అంద‌రూ శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్నార‌ని, వారి చేతుల్లో రాళ్ళు కూడా లేవ‌ని అరిచింది. ఆమె చూపుతోన్న ధైర్యానికి ఆశ్చ‌ర్యపోవ‌డం అంద‌రివంతు అయింది. శ్రీ‌లంక‌లో జీన్ ప్రిమ్రోస్ నాథానీల్స్జ్ అనే 90 ఏళ్ళ బామ్మ చేస్తోన్న పోరాటం ఇది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా ఆమె ఆందోళ‌న‌ల్లో పాల్గొంటోంది.

ఆమెను ‘ఆంటీ జీన్’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. శ్రీ‌లంక కొత్త అధ్య‌క్షుడిగా ర‌ణిల్ విక్ర‌మ సింఘే బాధ్య‌త‌లు స్వీక‌రించాక ఆందోళ‌న‌కారుల‌ను ఎలాగైనా అణ‌చివేయాల‌ని సైన్యానికి సూచించారు. దీంతో ఆందోళ‌న‌కారుల శిబిరాన‌లు సైనికులు బ‌లవంతంగా తొల‌గిస్తున్నారు. దీంతో సైనికుల ముందుకు వెళ్ళిన ఆ బామ్మ వారి వైపున‌కు చూపుడు వేలు చూపుతూ ప్ర‌శ్నించింది. అమాయ‌క ప్ర‌జ‌ల‌ను హింసించ‌డం ఏంట‌ని నిల‌దీసింది.

మీడియా ముందే త‌మ దేశ అధ్య‌క్షుడు ర‌ణిల్ విక్ర‌మ సింఘేను తిట్టింది. ఆమె ధ‌రించిన టీ-ష‌ర్టు ముందు భాగంలో పోరాటం అని రాసుకుంది. ఆ టీ-ష‌ర్టు వెనుక భాగంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం అని ఉంది. ఆ బామ్మ‌కు 13 మందికి మ‌న‌వళ్ళు/మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు. అలాగే, ఇద్ద‌రు ముని మ‌న‌వ‌ళ్ళు ఉన్నారు. ఆ బామ్మ చేస్తోన్న పోరాటానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌