ఆ లక్షణముంటే జాగ్రత్త, కరోనా కావొచ్చు, డాక్టర్ల హెచ్చరిక

  • Published By: naveen ,Published On : August 6, 2020 / 09:08 AM IST
ఆ లక్షణముంటే జాగ్రత్త, కరోనా కావొచ్చు, డాక్టర్ల హెచ్చరిక

కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరో కొత్త లక్షణాన్ని గుర్తించారు. అదే దురద.



అవును, చాలామంది అరికాళ్లలో దురదను చాలా లైట్ గా తీసుకుంటారు. పెద్ద సమస్య కాదని అనుకుంటారు. దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ అలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే, పాదంలో దురద కూడా కరోనా లక్షణాల్లో ఒకటి అని తేల్చారు.

ఇటీవలి కాలంలో కొవిడ్ బారిన పడ్డ బాధితుల్లో ఎక్కువమందిలో పాదంలో దురద లక్షణం కనిపిస్తోందని వాస్కులర్ నర్సు కన్సల్టెంట్ మరియు హడర్సీ ఫీల్డ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ అయిన లీన్ అట్కిన్ అన్నారు. అరికాళ్లలో మంటలు, దురద వంటివి వస్తున్నాయన్నారు. కొవిడ్ బాధితుల్లో దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.



ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని, డాక్టర్ ను సంప్రదించాలని, కరోనా టెస్టు చేయించుకోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు. దురద లాగా అనిపిస్తుంటే, మరీ ముఖ్యంగా పాదంలో, అది కరోనా సోకింది అని చెప్పడానికి ప్రధాన లక్షణం అన్నారు. కింగ్స్ కాలేజ్ లండన్, హెల్త్ సైనస్ కంపెనీ జో నిర్వహించిన స్టడీలో 17శాతం మందిలో దద్దుర్లు, దురద వంటి లక్షణాలు గుర్తించారు.

చాలామంది పాదంలో దురద రాగానే వాస్కులర్ క్లినిక్స్ కు వెళ్తున్నారని, దాంతో సమస్య మరింత తీవ్రం అవుతోందని నిపుణులు అంటున్నారు. అలా చేయడం వల్ల వారిలో కరోనా తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని, కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ ఉందన్నారు. పాదంలో దురద లేదా మంట లేదా బొబ్బలు వంటివి వచ్చినప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్య నిపుణులు సూచించారు. వాటిని తేలిగ్గా తీసిపారేయొద్దన్నారు.



కాగా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం, వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం వంటివి కూడా కరోనా లక్షణాలే అని ఇదివరకే గుర్తించిన సంగతి తెలిసిందే.