U.S Aid To Sudan : సూడాన్ కు అమెరికా బిగ్ షాక్
సూడాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సుడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. సూడాన్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం

Sudan
U.S Aid To Sudan సూడాన్ కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సుడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా తాజాగా ప్రకటించింది. సూడాన్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్ సహా పలువురు అధికారులను సోమవారం నిర్బంధించిన నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది. సూడాన్ లో సైనిక తిరుగుబాటు చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. సూడాన్ ప్రధానితోపాటు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దేశంలో ప్రజా అధికారాన్ని పునరుద్దరించాలని సూచించింది.
సూడాన్ కు అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైసె మాట్లాడుతూ.. తిరుగుబాటు అనేది సూడాన్ పౌరుల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తూట్లు పొడవడమేనని, దేశ రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించడమేని స్పష్టం చేశారు. ఆందోళనకారులపై హింసాత్మక ధోరణి అవలంబించొద్దని, వారిపై ఆయుధాలు ప్రయోగించవద్దని కోరారు. స్థానిక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, బలవంతంగా ఏది చేసినా అది ఇరు దేశాల మద్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
కాగా,సూడాన్ లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సోమవారం ఆ దేశ ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ ప్రకటించారు. దేశ అధికార మండలితో పాటు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఇక, సైన్యం తిరుగుబాటు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, 140 మంది వరకు గాయపడ్డారు. సూడాన్‌లో పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేశాయి.
ALSO READ Cobra As Murder Weapon : లైఫ్ ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..పాముకాటుతో కరిపించి చంపేశారు