చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించండి…భారత్‌పై అమెరికా ఒత్తిడి

  • Published By: venkaiahnaidu ,Published On : July 23, 2020 / 02:43 PM IST
చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించండి…భారత్‌పై అమెరికా ఒత్తిడి

సరిహద్దులో భారత్-చైనా ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విష్యం తెలిసిందే. సరిహద్దులో మన జవాన్లపై చైనా దాడికి దిగడంతో…చైనా ఎకానమీకి నష్టం కలిగించేలా భారత్ తీసుకున్న నిర్ణయంతో కమ్యూనిస్ట్ దేశం భయపడిపోయి మనం శత్రువులం కాదు మిత్రులం అంటూ కాళ్ళ బేరానికి వచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు, అమెరికాతో కూడా చైనాకు తగాదాలు ఉన్నాయి. కరోనా ముందునుంచే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా,కరోనా వైరస్ ఎంట్రీతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత హాంకాంగ్ లో పరిస్థితులు,ట్రేడ్ విషయాలు రెండు దేశాల మధ్య తీవ్ర అగాధం నెలకొనేలా చేసింది.

యుఎస్-చైనా సంబంధాలు – కరోనావైరస్ మహమ్మారి, హాంకాంగ్ మరియు వాణిజ్యం యొక్క పరిస్థితిపై ఇప్పటికే ఒత్తిడికి గురయ్యాయి – హ్యూస్టన్ లోని బీజింగ్ తమ కాన్సులేట్ ను చైనా మూసివేయాలని అమెరికా బుధవారం(జులై-23,2020) ఆదేశించడంతో పరిస్థితి అద్వనం గా మారింది

అమెరికా-చైనా దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో… చైనా వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ పిలుపునిచ్చారు.

అమెరికా -ఇండియా వర్చువల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా మైక్ పాంపీ మాట్లాడుతూ….అమెరికాకు భారతదేశం సహజ భాగస్వామి అని విశ్వసనీయమైన, మనస్సుగల కొన్ని దేశాలలో ఒకటి అని అన్నారు. చైనా నుండి దూరంగా ఉన్న ప్రపంచ సరఫరా గొలుసులను ఆకర్షించడానికి మరియు టెలికమ్యూనికేషన్స్, వైద్య సామాగ్రి మరియు ఇతర రంగాలలో చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశానికి అవకాశం ఉందని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మైక్ పాంపీ అన్నారు. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నమ్మకాన్ని సంపాదించిన భారత్ ఈ పొజీషన్ లో ఉందన్నారు.

టిక్‌టాక్‌తో సహా 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించినందుకు భారతదేశాన్ని ప్రశంసించిన ఆయన, వీడియో షేరింగ్ యాప్ భారతీయ ప్రజలకు తీవ్రమైన భద్రతా ప్రమాదాలను కలిగిస్తుందని అన్నారు.

ఈ సమ్మిట్ లో ముఖ్య ఉపన్యాసం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ… 1.3 బిలియన్ల జనాభా కలిగిన భారత దేశంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం.. వైరస్ బారిన పడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి సహాయపడుతుందని అన్నారు.