Chinese Donkey : ప్రమాదంలో గాడిద జాతి.. వైద్యం కోసం లక్షల గాడిదలను చంపేస్తున్న చైనీయులు

గాడిద జాతి ప్రమాదంలో పడింది. చైనీయులు తమ సంప్రదాయ వైద్యం కోసం గాడిదలను చంపేస్తున్నారు. చైనీయులు గెలాటిన్ ఆధారిత సంప్రదాయ మెడిసిన్ తయారు చేస్తారు. దీని కోసం గాడిదలను చంపుతున్నారు. ప్రతి ఏటా 50 లక్షల గాడిదలను వధిస్తున్నారు. ఇది ఇలా

Chinese Donkey : ప్రమాదంలో గాడిద జాతి.. వైద్యం కోసం లక్షల గాడిదలను చంపేస్తున్న చైనీయులు

Chinese Donkey

Chinese Donkey : గాడిద జాతి ప్రమాదంలో పడింది. చైనీయులు తమ సంప్రదాయ వైద్యం eకోసం గాడిదలను చంపేస్తున్నారు. చైనీయులు గెలాటిన్ ఆధారిత సంప్రదాయ మెడిసిన్ తయారు చేస్తారు. దీని కోసం గాడిదలను చంపుతున్నారు. ప్రతి ఏటా 50 లక్షల గాడిదలను వధిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే, రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని సగానికిపైగా గాడిదలు చనిపోనున్నాయి.

చైనాలో మందుల తయారీ కోసం ఎక్కువగా జంతువుల మీద ఆధారపడతారు. కొన్నేళ్లుగా సంప్రదాయ వైద్యానికి చైనాలో డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా కొన్ని జంతువుల జాతులు ప్రమాదంలో పడ్డాయి. కొన్ని జంతువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గాడిదల వంతు వచ్చింది.

2007 నుంచి బ్రెజిల్ లో గాడిదల సంఖ్య 28శాతం తగ్గిపోయింది. బోత్స్ వానా, కిర్గిస్తాన్ దేశాల్లో 37, 53శాతానికి పడిపోయింది. కారణం ఏంటో తెలీదు. ఇక చైనా సంగతికి వస్తే 1992 నుంచి ఆ దేశంలో 76శాతానికి గాడిదల సంఖ్య పడిపోయింది. చైనాలో గాడిదలు సరిపడ లేకపోవడంతో ఇతర దేశాల గాడిదలపై పడ్డారు.

చైనాలో సంప్రదాయ పద్ధతిలో మందు తయారు చేస్తారు. గెలాటిన్ అనే మందుని అనీమియా రోగులకు వాడతారు. వేల సంవత్సరాలుగా ఈ మందుని వాడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ మందు వినియోగం బాగా పెరిగింది. దీంతో గాడిదల కొరత ఏర్పడింది. సౌత్ అమెరికా, ఆఫ్రికా, సెంట్రల్ ఏసియాల నుంచి గాడిదలను తెప్పించుకుంటోంది చైనా. ఇలా అన్ని దేశాల నుంచి గాడిదలను తెప్పించుకోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా గాడిద జాతి సంక్షోభంలో పడింది.

చైనీయులు తమ సంప్రదాయ వైద్యంలో గాడిద చర్మాన్ని వాడతారు. గాడిదలను చంపి వాటి చర్మాన్ని వలిచి.. అందులోని పదార్దాన్ని మెడిసిన్ తయారీలో వాడతారు.