Driverless Train : డ్రైవర్ లేకుండానే నడిచే రైలు

ఆధునిక టెక్నాలజీతో ఇప్పుడు డ్రైవర్ లేకుండానే నడిచే స్థితికి వచ్చింది. డ్రైవర్ అవసరం లేని పూర్తి ఆటోమేటెడ్ రైలును ప్రపంచంలోనే మొదటిసారిగా జర్మనీలో ఆవిష్కరించారు.

Driverless Train : డ్రైవర్ లేకుండానే నడిచే రైలు

driverless train in Germany : ఏదైనా వాహనం కదలాలంటే డ్రైవర్ తప్పకుండా ఉండాల్సిందే అన్న సంగతి తెలిసిందే. అలాగే రైలు నడవాలంటే కూడా డ్రైవర్ ఉండాలి. అయితే రైలు కదలాలంటే డ్రైవర్ కు గార్డు పచ్చజెండా ఊపుతాడు. ఆ తర్వాత డ్రైవర్ హారన్ కొట్టి, రైలు బండిని మెల్లగా ముందుకు నడుపుతాడు. కానీ ఆధునిక టెక్నాలజీతో ఇప్పుడు డ్రైవర్ లేకుండానే రైలు నడిచే స్థితికి వచ్చింది.

డ్రైవర్ అవసరం లేని పూర్తి ఆటోమేటెడ్ రైలును ప్రపంచంలోనే మొదటిసారిగా జర్మనీలో ఆవిష్కరించారు. సంప్రదాయ రైళ్లతో పోలిస్తే ఈ ట్రెయిన్ సమయ పాలనలో చాలా నిక్కచ్చిగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంధనాన్ని 30 శాతం మేర పొదుపు చేస్తుందని చెబుతున్నారు. 30 శాతం మేర ఎక్కువగా ప్రయాణికులను రవాణా చేయగలదని వెల్లడించారు.

BMW Scooter: ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ

జర్మనీలోని రైల్వే సంస్థ డాయ్ చు బాన్, సీమన్స్ సంస్థలు హాంబర్గ్ లో వీటిని ఆవిష్కరించారు. డిసెంబర్ నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మరికొన్ని నగరాల్లో డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు ఉన్నాయి. పూర్తిస్థాయి రైలును ఈ విధంగా తీర్చిదిద్దడం మాత్రం ఇదే తొలిసారి. అయినా పర్యవేక్షణ కోసం ఒక డ్రైవర్ ను రైలులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.