Diabetes: రెండు ఫుడ్ ఐటెంలతో డయాబెటిస్ మరణం వరకూ తీసుకెళ్లొచ్చు

జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో రీసెంట్ గా పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. ఉప్పుతో పాటు మరి కొన్ని మాంసాహారాలు..

Diabetes: రెండు ఫుడ్ ఐటెంలతో డయాబెటిస్ మరణం వరకూ తీసుకెళ్లొచ్చు

Diabetes

Diabetes: జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో రీసెంట్ గా పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. ఉప్పుతో పాటు మరి కొన్ని మాంసాహారాలు డయాబెటిస్ తో వచ్చే చావు వరకూ తీసుకెళ్లొచ్చని తెలిసింది. డయాబెటిస్, స్ట్రోక్స్, హార్ట్ డిసీజ్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల కారణంగా లక్షల సంఖ్యలో చనిపోతున్నట్లు తెలిసింది. ఈ మరణాలలో అన్నీ ఎక్కువగా ఉప్పు తినడం, మాంసాహారం తీసుకోవడం వల్ల జరిగినవే అని రికార్డులు చెబుతున్నాయి. ఒమెగా-3 సరిపడ ఉన్న ఆహారం తీసుకోకపోవడం, పప్పు ధాన్యాలు, విత్తనాలు మాత్రమే తీసుకోవడం కూడా ప్రమాదమే.

ఉప్పు, సాస్ లు, కుక్క మాంసం, బీఫ్, దాచి పెట్టి ఉంచిన మాంసం, మాంసంతో తయారుచేసే శాస్ లు వంటివి. అలా జరగడం వల్ల 10శాతం మరణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉప్పులో నానబెట్టినవి, ఉప్పుతో నిల్వ ఉంచే మాంసం, కూరగాయలు ప్రమాదం.

రీసెంట్ స్టడీలలో డయాబెటిస్,, స్ట్రోక్, హార్ట్ డిసీజ్ లు అన్నీ ఉప్పు ఎక్కువగా తినడం వల్లనే వస్తున్నాయి. బయటి ఫుడ్ తినే వారిలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరిగి గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఉప్పు సరిపడ మాత్రమే తినడం, తాజా కూరగాయలు, తాజా మాంసం తినడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.