California: సైకిల్ పై వచ్చి చోరీ చేసిన దొంగ.. వీడియో తీసిన కస్టమర్లు

కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్‌గ్రీన్స్‌లోని ఒక షాపులోకి సైకిల్‌ మీద వచ్చాడు దొంగ. తనతో పాటు ఓ నల్ల కవర్ తెచ్చుకున్నాడు. ఆ నల్లటి కవర్ లో అక్కడ ఉన్న వస్తువులను వేసుకున్నాడు.

California: సైకిల్ పై వచ్చి చోరీ చేసిన దొంగ.. వీడియో తీసిన కస్టమర్లు

California

California: చోరీలు చేసేముందు దొరికిపోతామేమో అని చాలామంది దొంగలు భయపడతుంటారు. చుట్టూ ఎమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయేమో పరిశీలించి ఎవరికంట పడకుండా దొంగతనం చేస్తుంటారు. అయితే ఓ దొంగమాత్రం సైకిల్ వేసుకొని సూపర్ మార్కెట్లోకి వచ్చి అందరిముందే చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్‌గ్రీన్స్‌లోని ఒక షాపులోకి సైకిల్‌ మీద వచ్చాడు దొంగ. తనతో పాటు ఓ నల్ల కవర్ తెచ్చుకున్నాడు. ఆ నల్లటి కవర్ లో అక్కడ ఉన్న వస్తువులను వేసుకున్నాడు. దొంగ కవర్ లో వస్తువులు వేసుకుంటుంటే సెక్యూరిటీ అక్కడే ఉన్నాడు. దొంగ సంచిలో వస్తువులు వేసుకొని సైకిల్ పై పెట్టుకొని పారిపోతుండగా సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడు సెక్యూరిటీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు.

అక్కడ ఉన్న వారిలో ఒక్కరు కూడా దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు.. కానీ ఆ దొంగతనాన్ని మాత్రం తమ సెల్ ఫోన్లలో బంధించారు. దానిని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే, శాన్‌ఫ్రాన్సిస్కోలో కొన్ని వివాదస్పద చట్టాలు ఉన్నాయి. దీని ప్రకారం, తక్కువ ధర ఉన్న వస్తువులను చోరీ చేస్తే విధించే శిక్షలను, జరిమానాలను తగ్గించారు. దీంతో కొంత మంది చిల్లర దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు.