Birthday Celebration: దొంగను అరెస్టు చేసి.. అతడి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన పోలీసులు

దొంగ దొరికాడంటే అతడి నుంచి నిజాలు ఎలా రాబట్టలా అని చూస్తుంటారు పోలీసులు. సరిగా చెప్పకపోతే లాఠీకి పని చెబుతారు. అయితే ఇక్కడ మాత్రం ఆలా జరగలేదు.. దొంగపై దెబ్బ కూడా వేయకుండా బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

Birthday Celebration: దొంగను అరెస్టు చేసి.. అతడి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన పోలీసులు

Birthday Celebration

Birthday Celebration: దొంగ దొరికాడంటే అతడి నుంచి నిజాలు ఎలా రాబట్టలా అని చూస్తుంటారు పోలీసులు. సరిగా చెప్పకపోతే లాఠీకి పని చెబుతారు. అయితే ఇక్కడ మాత్రం ఆలా జరగలేదు.. దొంగపై దెబ్బ కూడా వేయకుండా బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అది సాధారణంగా ఏమి కాదు.. కేక్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఆర్డర్ ఇచ్చి పోలీసులు అందరు బర్త్ డే సాంగ్ పాడుతూ దొంగ చేత కేక్ కోయించారు. ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే ప్రాంతంలో పౌలో రోడ్రిగో దాస్ నివెస్ అనే యువకుడు నివసిస్తున్నాడు. దొంగతనాలే జీవనాధారంగా చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో పార్క్ చేసే కార్లలోని సౌండ్ సిస్టమ్, ఆడియో సామాగ్రిని దొంగతనం చేసి బయట అమ్ముతుంటాడు. ఆలా ఓ కారులో దొంగతనం చేశాడు. కారు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కారును పరిశీలించిన పోలీసులు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకొని చూశారు. పౌలో రోడ్రిగో దాస్ నివెస్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే అదే రోజు అతడి 18 పుట్టిన రోజు కావడంతో పోలీసులు వేడుకల కోసం ఏర్పాట్లు చేశారు. కేక్, కూల్ డ్రింక్ తెప్పించి కేక్ కట్ చేయించారు. అనంతరం బర్త్ డే సాంగ్ పాడారు. ఇక ఆ కేక్ లో సగం తన తల్లికి పంపించాడు పౌలో రోడ్రిగో దాస్ నివెస్.

అయితే ఈ బర్త్ డే వేడుకకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు విచారణ చేశారు. దొంగకు బర్త్ డే వేడుకలు నిర్వహించారని షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు పంపారు. అయితే దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అతడికి 18 ఏళ్ళు నిండాయి కాబట్టి నేరాలు చేస్తే పెద్ద శిక్షలు పడతాయని గుర్తు చేసేందుకు ఇలా బర్త్ డే జరిపించి ఉంటారని అంటున్నారు.

మరికొందరేమో నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రదర్.. పోలీసుల చేతికి చిక్కి ఎంచక్కా బర్త్ డే జరుపుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.