కరోనా రాకుండా శానిటైజర్ వాడుతున్నారా, అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

  • Published By: naveen ,Published On : July 26, 2020 / 12:33 PM IST
కరోనా రాకుండా శానిటైజర్ వాడుతున్నారా, అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

కరోనా భయంతో ఏది ముట్టుకున్నా వెంటనే  శానిటైజర్ తో చేతులు క్లీన్ చేసుకుంటున్నారా? ఏ మాత్రం అనుమానం అనుమానం వచ్చినా చేతుల్లో స్ప్రేతో కొట్టేసుకుంటున్నారా? శానిటైజర్ అప్లయ్ చేసుకున్నాము, ఇక మాకు కరోనా రాదని భరోసాగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త. శానిటైజర్ కరోనాను పూర్తిగా అడ్డుకుంటుందో లేదో తెలియదు కానీ, శానిటైజర్ ఎక్కువగా వాడితే మాత్రం ప్రమాదమే అంటోంది కేంద్రం.

చేతులను శుభ్రంగా ఎన్నిసార్లు అయినా సబ్బుతో కడుక్కోండి.. కానీ, శానిటైజర్ ను అతిగా వాడొద్దని కేంద్రం సూచించింది. అసలు, శానిటైజర్ల గురించి కేంద్రం ఇలా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? శానిటైజర్ అతిగా వినియోగిస్తే కలిగే ప్రమాదాలు ఏంటి?

* ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత శానిటైజర్ వాడకూడదు
* శానిటైజర్ వాడకంతో ఉపయోగాల కన్నా అనర్థాలే ఎక్కువ
* అతిగా శానిటైజర్ వినియోగం ప్రమాదం
* శానిటైజర్ కారణంగా అర చేతుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది
* వాస్తవానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు దోహదం చేస్తాయి
* శానిటైజర్లలో 60 నుంచి 90శాతం ఆల్కహాల్ ఉంటుంది, అదే క్రిములను చంపుతుంది
* అధిక మోతాదులో శానిటైజర్ వినియోగం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది

* అవసరమైనంత వరకే శానిటైజర్ ను వాడాలి
* శరీరానికి, చేతులకు సహస సిద్ధంగా ఉండే రోగనిరోధక శక్తి స్థాయి తగ్గిపోతుంది
* శానిటైజర్ ఎక్కువగా వాడితే చర్మం పొడి బారుతుంది, మంట, ఎరుపెక్కుతుంది
* ఇంట్లో ఉన్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం మంచిది
* క్రిముల బారిన పడకుండా ఉండాలంటే 20సెకన్ల పాటు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
* శానిటైజర్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ