16th Century Engagement Ring : ఇది 16వ శ‌తాబ్ధ‌పు ఎంగేజ్‌మెంట్ రింగ్..! యూనిక్ డిజైన్‌కు నెటిజన్లు ఫిదా

జ‌ర్మ‌నీకి చెందిన 16వ శ‌తాబ్ధ‌పు ఎంగేజ్‌మెంట్ రింగ్ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ రింగ్ లో మరో ప్రత్యేకత దీన్ని వైరల్ గా మార్చింది. అదేమిటంటే..ఈ రింగ్ సాధారణం రింగ్ లా కాకుండా..

16th Century Engagement Ring : ఇది 16వ శ‌తాబ్ధ‌పు ఎంగేజ్‌మెంట్ రింగ్..! యూనిక్ డిజైన్‌కు నెటిజన్లు ఫిదా

16th Century Engagement Ring

16th Century Engagement Ring : జ‌ర్మ‌నీకి చెందిన 16వ శ‌తాబ్ధ‌పు ఎంగేజ్‌మెంట్ రింగ్ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ రింగల్ లో మరో ప్రత్యేకత దీన్ని వైరల్ గా మార్చింది. అదేమిటంటే..ఈ రింగ్ సాధారణం రింగ్ లా కాకుండా..మినీ ఆస్ట్ర‌నామిక‌ల్ మ్యాప్ డిజైన్‌తో ఉంది.దీంతో ఈ రింగ్‌కు సంబంధించిన పోస్ట్ ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది.

ఎంగేజ్‌మెంట్ రింగ్స్ జంట‌ల‌కు ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. వాటిని ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారు. జంటలు ఒక్కటిగా కలిసిన శుభ గడియలను గుర్తు చేసుకుంటుంటారు. ఎంగేజ్ మెంట్ రింగ్ అంటే వజ్రం ఉండాల్సిందే. ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌లో డైమండ్ ఉండితీరాల‌నే విశ్వాసం కూడా చాలా మందిలో పాతుకుపోయింది. ప్రిన్సెస్ క‌ట్స్‌, ఓవ‌ల్ క‌ట్స్‌, కుష‌న్ క‌ట్స్ అంటూ ప‌లు ఆప్ష‌న్స్ తో ఈ రింగ్స్ సొబగులు అద్దుకుంటాయి. వారి వారి టేస్టులకు తగినట్టుగా రింగ్ లను డిజైన్ చేసుకుంటుంటారు. ఆ డిజైన్లు ఓ అర్థం ఉండాలని ఆకాంక్షిస్తుంటారు జంటలు. అటువంటిదే ఈ 16వ శతాబ్దానికి చెందిన ఎంగేజ్ మెంట్ రింగ్ కు కూడా ఓ అర్థం ఉందని తెలుస్తోంది.

తాను అమితంగా ప్రేమించే వ్య‌క్తి చేతిలో యావ‌త్ ప్ర‌పంచం ఇమిడిఉంద‌నేలా ఈ రింగ్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్ట్‌కు 1.52 ల‌క్ష‌లకు పైగా లైక్స్‌తో పాటు పెద్ద‌సంఖ్య‌లో రియాక్ష‌న్స్ వ‌చ్చాయి. ఖ‌రీదైన సాలిటైర్స్ కంటే ఇది ఎంతో అర్ధ‌వంతంగా, మెరుగ్గా ఉంద‌ని ఈ రింగ్‌ సూపర్బ్ గా ఉందని తెగ పొగిడేస్తున్నారు నెటిజ‌న్లు. మ‌న‌సు పారేసుకున్నారు. ఈ రింగ్ ప్రేమ‌కు అచ్చమైన ప్రేమకు సంకేత‌మ‌ని కితాబిస్తున్నారు. ఈ రింగ్ చూసినవారు ప్రేమకు ఎస్ అని చెప్పి తీరాల్సిందేనంటున్నారు.