సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను ఫ్యూయల్ గా మార్చేసే యాచ్ వచ్చేసింది

సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను ఫ్యూయల్ గా మార్చేసే యాచ్ వచ్చేసింది

ocean cleanup yacht ఫ్రెంచ్ కు చెందిన ఓ ఓషన్ అడ్వెంచరర్(సముద్ర సాహసికుడు) మరియు అతని బృందం ఒక యాచ్(పడవ)ను రూపొందించారు. ఇది సముద్రాల్లోని ప్లాస్టిక్ చెత్తను పైకి తోడుతుందని..అదేవిధంగా అదే వ్యర్థాలను పడవకు అవసరమయ్యే ఇంధనంగా మారుస్తుందని ఓషన్ అడ్వెంచరర్ వైవాన్ బౌర్గాన్ చెప్పారు. ప్రస్తుతం ఇది డ్రాయింగ్ బోర్డులో మాత్రమే ఉంది. 2024 లో దీన్ని లాంఛ్ చేయాలని చూస్తున్నారు.

వైవాన్ బౌర్గాన్..పోటీ పడవదారుడిగా తన కెరీర్ ను.. ప్రపంచవ్యాప్తంగా రేసింగ్ సెయిలింగ్ వెజల్స్ పై గడిపాడు. అయితే సంవత్సరాలుగా చెత్త యొక్క తేలియాడే కార్పెట్స్ సముద్రంలో తరచుగా అతనికి ఎదురయ్యేవి. ఇదే అతని కొత్త వెంచర్ కు ప్రేరణ అయింది.

ప్రస్తుతం అతడు రూపొందించిన 56-మీటర్ల (183 అడుగుల) పొడవైన కాటమరాన్(కాటమరాన్ అనేది ఒక పడవ, ఇది ఒకే పొట్టుకు బదులుగా రెండు పొట్టులను కలిగి ఉంటుంది) హైటెక్ సెయిల్స్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు కలయికతో ముందుకు సాగుతుంది.

పడవ నీటిలో కదులుతున్నప్పుడు…కన్వేయర్ బెల్టులు వ్యర్థాలను ఏరి.. క్రమబద్ధీకరిస్తాయి, తరువాత దానిని కాల్చుతుంది . ఇది ప్లాస్టిక్‌ను కరిగించి, టర్బైన్‌ను నడిపించే వాయువును ఉత్పత్తి చేస్తుంది మరియు పడవ వ్యవస్థలను ఉపయోగించటానికి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తు..బోటు డెక్ పైన ఉండే సోలార్ సెల్స్ మరియు విండ్ టర్బైన్‌లతో పాటు పడవని 70% ఎనర్జీతో స్వయం సమృద్ధిగా మార్చుతుంది.

ఇలాంటివి 400 బోటులు కనుక తయారుచేస్తే..సముద్రాల్లోని 1/3వ వంతు ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీన్ చేయగలదని బౌర్గాన్ చెప్పారు. 2060 నాటికి సముద్రాల్లో ఇప్పుడుదానికంటే మూడు రెట్టు ఎక్కువ చెత్త ఉంటుందని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేశారు. మేము కేవలం పొడి ల్యాండ్ పై మాత్రమే దృష్టిపెట్టడతాం.. సముద్రాల్లోకి వ్యర్థాలను వదలుతాం అని ఎవరైనా అంటుంటే ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు.