ఈ ప్లానెట్ చాలా హాట్ గురూ, ప్రతి 36 గంటలకు 4 సీజన్లు, 2 వేసవులు-2 శీతాకాలాలు

10TV Telugu News

నాసాకి చెందిన ప్లానెట్ హంటింగ్ శాటిలైట్ టెస్(TESS-Transiting Exoplanet Survey Satellite) కొత్త గ్రహాలను(Planets) కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో KELT-9 b అనే గ్రహాన్ని కనుగొంది. ఇప్పుడీ ప్లానెట్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఈ ప్లానెట్ చాలా హాట్ గురూ. అవును విపరీతమైన వేడిగా ఉంటుంది. కొన్ని నక్షత్రాలతో పోలిస్తే ఈ గ్రహం వాటికన్నా వేడిగా ఉందట. అంతేకాదు ప్రతి 36 గంటలకు నాలుగు సీజన్లు(కాలాలు) వస్తున్నాయి. రెండు సమ్మర్, రెండు వింటర్.

హైడ్రోజన్ అణువుల కన్నా హాట్:
ఇప్పటివరకు కనుగొన్న కొత్త గ్రహాల్లో కెల్ట్-9 బి, చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు కనుగొన్న వాటిలో ఇదే అత్యంత హాటెస్ట్ ప్లానెట్. ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్ 7వేల 800 డిగ్రీల ఫారిన్ హీట్ గా ఉంది. అంటే 4వేల 300 డిగ్రీల సెల్సియస్ అన్నమాట. హైడ్రోజన్ మాలిక్యూల్స్(అణువులు) కన్నా ఇది చాలా హాట్ గా ఉంది. ”ఇది చాలా పెద్ద ప్లానెట్. వేగంగా తిరిగే నక్షత్రం చుట్టూ చాలా దగ్గరగా, దాదాపు ధ్రువ కక్ష్యలో ఉన్న ఒక పెద్ద గ్రహం. ఈ లక్షణాలు నక్షత్రాన్ని అర్థం చేసుకునే మన సామర్థ్యాన్ని, గ్రహం మీద దాని ప్రభావాలను క్లిష్టతరం చేస్తాయి” అని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జాన్ అహ్లర్స్ చెప్పారు.

ఓవైపు హాట్, మరోవైపు కూల్:
ఈ గ్రహంలోని ఒక భాగం నిత్యం సూర్యుడి వైపు ఉంటుంది. దీంతో ఆ భాగం చాలా హాట్ గా ఉంటుంది. కాగా, మరో భాగం మాత్రం చల్లగా ఉంటుంది. ఓవైపు వేడిగా, మరోవైపు చల్లగా.. ఇలా ఒకే గ్రహంలో భిన్నమైన వాతావరణాలు. అందుకే ఈ గ్రహం చాలా ప్రత్యేకంగా మారిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిగతా గ్రహాలతో పోలిస్తే ఈ గ్రహం వింతగా కనిపించడానికి మరో కారణం కూడా ఉంది. భ్రమణానికి(rotation) కేవలం 16 గంటలు మాత్రమే సమయం పడుతోంది. సూర్యుడి కన్నా 38 రెట్లు అధికమైన వేగంతో తిరుగుతుంది. ఈ స్పీడ్ దాని షేప్ పై ప్రభావం చూపుతుంది. ఈ వేగం వల్లే పోల్స్ దగ్గర హాటర్ గా ఉండటానికి, ఈక్వేటర్ దగ్గర కూల్ గా ఉండటానికి కారణం అని శాస్త్రవేత్తలు వివరించారు.

మరింత లోతుగా స్టడీ:
నక్షత్రాల పోల్స్ దగ్గర నుంచి ఈ గ్రహం వెళ్లినప్పుడు వేసవి లాంటి అనుభవం కలుగుతుంది. అదే ఈక్వేటర్ దగ్గర నుంచి వెళ్లినప్పుడు శీతాకాలం లాంటి అనుభూతి కలుగుతుంది. అందుకే కెల్ట్-9 b గ్రహం, ప్రతి ఏటా రెండు వేసవులు, రెండు శీతాకాలాలను ఎక్స్ పీరియన్స్ చేస్తుంది. అది కూడా 9 గంటల పాటు. కెల్ట్ 9 బి, ఇతర గ్రహాలను అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. ”గురుత్వాకర్షణ చీకటి ద్వారా మేము అధ్యయనం చేసిన గ్రహ వ్యవస్థలలో, KELT-9 b పై ప్రభావాలు చాలా అద్భుతమైనవి” అని ఇడాహో విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్, సహ రచయిత జాసన్ బర్న్స్ చెప్పారు. “ఈ పని గ్రహాల అమరికను కొలిచే ఇతర పద్ధతులతో గురుత్వాకర్షణ(gravity) చీకటిని ఏకీకృతం చేయడానికి చాలా దూరం వెళుతుంది, చివరికి అధిక ద్రవ్యరాశి నక్షత్రాల చుట్టూ గ్రహాల నిర్మాణం, పరిణామ చరిత్ర గురించి రహస్యాలను తెలుపుతుందని మేము ఆశిస్తున్నాము” అని విశ్వాసం వ్యక్తం చేశారాయన.

Read Here>>కరెంట్ బిల్లు రూ.లక్ష రావడంతో నటుడికి కోపం వచ్చింది