Rare Pink Diamond : వేలానికి అరుదైన పింక్ డైమండ్ .. ధర వింటే షాక్ అవ్వాల్సిందే

అరుదైన పింక్ డైమండ్ వేలానికి సిద్ధమైంది. జెనీవాలో త్వరలో వేలానికి సిద్ధమైందీ పింక్ డైమండ్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే అనేంత రేంజ్ లో ఉంది.

Rare Pink Diamond : వేలానికి అరుదైన పింక్ డైమండ్ .. ధర వింటే షాక్ అవ్వాల్సిందే

Rare Pink Diamond

Rare Pink Diamond: మట్టిలో ఉన్నా వజ్రం వజ్రమే. వజ్రాల మెరుపులు నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా ఉంటాయి. మెరుపుకు తగినట్లుగానే వాటి విలువ కూడా ఉంటుంది. అటువంటి ఓ అరుదైన అద్భుతమైన వజ్రం వేలానికి సిద్ధమైంది. అదే అత్యంత అరుదైన ‘పింక్ డైమండ్’. అరుదైన ఫార్చ్యూన్ పింక్ పియర్ డైమండ్‌.. రెండు వైపులా తెల్లగా మెరుస్తూ మధ్యలో గులాబీ రంగుతో కనిపిస్తున్న అత్యంత నాణ్యమైన ఈ వజ్రం వేలానికి సిద్ధమైంది. దాని ధర వింటే షాక్ అవ్వాల్సిందే. రూపంలో కళ్లు తిప్పుకోనివ్వని అందం..దర్పం దీని సొంతమైతే ధరలో కూడా ఏమాత్రం తగ్గేదేలేదంటోందీ అరుదైన ‘పింక్ డైమండ్’..!

రెండు వైపులా తెల్లగా మెరుస్తూ మధ్యలో గులాబీ రంగుతో కనిపిస్తున్న అత్యంత నాణ్యమైన..అరుదైన అద్భుతమైన ఈ వజ్రాన్ని చూస్తే కళ్లు తిప్పుకోలేదు. తన దర్పంతో అందరినీ ఆకర్శిస్తోందీ పింక్‌ డైమండ్. ఈ గులాబీ సోయగాల వజ్రం 18.18 క్యారెట్ల బరువు ఉంది. స్విట్జర్లాండ్ జనీవాలో నవంబర్‌ 8న ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు సిద్ధమౌతోంది క్రిస్టీస్‌ ఆక్షన్‌ హౌస్‌..

Chameleon Diamond: రంగులు మారుస్తున్న వజ్రం..సైటిస్టులు సైతం షాక్

అతిపెద్ద పియర్-ఆకారపు పింక్ డైమండ్ ను వేలంలో విక్రయించనున్నట్లు క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ సోమవారం (సెప్టెంబర్ 26,2022) తెలిపింది. ఈ పింక్‌ డైమండ్‌ ఎంత తక్కువ అంచనా వేసినా..అమెరికన్‌ డాలర్లలో 25 మిలియన్ల నుంచి 35 మిలియన్ల దాకా రాబట్టగలదని అంచనా వేస్తున్నారు వేలం నిర్వాహకులు. అంటే భారత కరెన్సీలో 204 కోట్ల 73 లక్షల నుంచి 285 కోట్ల 21 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ఈ అరుదైన ఈ ఫార్చ్యూన్ పింక్ పియర్ డైమండ్‌ వజ్రాలు సేకరించే కుబేరుల దృష్టిని ఆకర్శించగలదని భావిస్తున్నారు క్రిస్టీస్‌ ఆక్షన్‌ హౌస్‌ నిర్వాహకులు.. ఊహించిన ధరకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు వేలం నిర్వాహకులు. వేలం చరిత్రలో ఈ పింక్ డైమండ్ కొత్త చరిత్ర సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

Diamond : 15 ఏళ్ల అన్వేషణ.. 8.22 క్యారెట్ల వ‌జ్రం లభ్యం

18.18 క్యారెట్లను ఆసియాలో అదృష్ట సంఖ్యగా చెబుతున్నారు క్రిస్టీ సీనియర్ జ్యువెలరీ స్పెషలిస్ట్ ఏంజెలా బెర్డెన్.. దీన్ని సొంతం చేసుకోబోయే కొత్త యజమానికి నిజంగా అదృష్టం తెచ్చిపెట్టగలదంటున్నారామె.. ఇంత అందమైన పింక్‌ డైమండ్‌ దొరకడం చాలా అరుదు అని చెప్పుతున్నారు క్రిస్టీ ఆక్షన్‌ హౌస్‌ నిర్వాహకులు.. బరువు, రంగు, స్పష్టత కూడా ఎంతో కచ్చితత్వంతో ఉందని పింక్‌ డైమండ్‌ ప్రత్యేకతలను వివరిస్తున్నారు.

కాగా..క్రిస్టీ ఆక్షన్‌ హౌస్‌ 2018లో 18.96 క్యారెట్ల విన్‌స్టన్ పింక్ లెగసీని వేలం వేస్తే 50 మిలియన్‌ అమెరికన్‌ డాలర్స్‌ వచ్చాయి.. అయితే 37.3 క్యారెట్ల రాజ్‌ పింక్‌ డైమండ్‌ను వేలం వేస్తే 30 మిలియర్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. మరి ఈ అరుదైన పింక్ డైమండ్ అంతకంటే ఎక్కువ అంటే 35 మిలియన్ల దాకా రాబట్టగలదని అంచనా వేస్తున్నారు.

The Sakura Pink Diamond: రూ.213 కోట్ల డైమండ్.. వేలంలో దక్కించుకున్న వ్యాపారి!

ఈక్రమంలో ఈ పింక్ డైమండ్ చైనాలోని షాంఘై (అక్టోబర్ 10 నుండి 13 వరకు), తైవాన్ (అక్టోబర్ 21 నుండి 23 వరకు) సింగపూర్ (అక్టోబర్ 28 నుండి 30 వరకు) ఫార్చ్యూన్ పింక్ అక్టోబర్ 3 నుండి ఒక వారం పాటు క్రిస్టీస్ న్యూయార్క్‌లో ప్రదర్శించబడుతుంది. నవంబర్ 2 నుండి 8 వరకు స్విజర్లాండ్ లోని జెనీవాలో జరిగే ఫోర్ సీజన్స్‌లో క్రిస్టీస్ లగ్జరీ వీక్‌కి వజ్రం వెళుతుంది. అక్కడ వేలం నిర్వహించబడుతుంది.