Spoon : 90 పైసల ఈ డొక్కు స్పూన్ రూ. 2 లక్షలకు అమ్ముడయింది

ఓ వ్యక్తి 90 పైసలకు ఓ స్పూన్ కొని దానిని ఆన్‌లైన్ లో అమ్మకానికి పెట్టారు. ఆన్‌లైన్ వేలంలో ఆ స్పూన్ రూ. 2 లక్షల ధర పలికింది. దీనికి వెనక పెద్ద కథే ఉంది. ఆ స్పూన్ ఇప్పటిది కాదు.. అందుకే దానికి అంత ధర పలికినట్లు లారెన్సెస్ ఆక్షనీర్స్ సంస్థ ప్రతినిధులు చెబుతన్నారు.

Spoon : 90 పైసల ఈ డొక్కు స్పూన్ రూ. 2 లక్షలకు అమ్ముడయింది

Spoon

Spoon : స్పూన్ ధర ఎంతుంటింది… మహా అంటే 10 రూపాయలు.. స్టైన్ లెస్ స్టీల్ తో చేస్తే,..ఓ 50 రూపాయలు ఉంటుంది. పెద్ద పెద్ద మాల్స్ లో కొన్నా 100 రూపాయలకు మించదు. కానీ 90 పైసలు పెట్టి కొన్న స్పూన్ ను ఏకంగా రూ. 2లక్షలకు అమ్మారు. ఆన్‌లైన్ వేలంలో ఈ స్పూన్ రికార్డు స్థాయి ధర పలికింది. ఈ స్పూన్ ను ఎదో ఖరీదైన లోహంతో కూడా చేయలేదు. కానీ ఇంత ధర పలికింది.

కారణం దీనికి పెద్ద చరిత్ర ఉండటమే.. లండన్ కు చెందిన ఓ వ్యక్తి వారాంతపు సంతలో భారత కరెన్సీ ప్రకారం ఓ స్పూన్ ను 90 పైసలకు కొన్నాడు. అది చూడడానికి వింతగా ఉండటంతో సోమర్‌సెట్‌లోని లారెన్సెస్ ఆక్షనీర్స్ సంస్థను సంప్రదించి ఆ చెంచాను ఆన్‌లైన్‌లో వేలం వేసేందుకు నమోదు చేసుకున్నాడు. ఈ స్పూన్ ను ఆ సంస్థకు చెందిన సిల్వర్ ఎక్స్‌పర్ట్ అలెక్స్ బచర్ పరిశీలించాడు. అతడి పరిశీలనలో ఇది 13వ శతాబ్దం నాటి అరుదైన వస్తువుగా తెలిసింది.

దీంతో కంపెనీ దాన్ని చరిత్రను మొత్తం బ్లాగ్ లో రాసి ఆన్‌లైన్లో రూ.51,712 కు అమ్మకానికి పెట్టింది. దీనిని కొనేందుకు చాలామంది పోటీ పడ్డారు. వెండితో చేసిన ఈ స్పూన్ ను రూ.1,97,000 కు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. టాక్స్ లు అన్ని కలిపి రెండు లక్షల రూపాయల వరకు చేరింది. ఈ ధరను చూసి స్పూన్ ఓనర్ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆ స్పూన్ ని 90 పైసలకు కొనుగోలు చేసిన వ్యక్తి ఇంత ధరకు పోతుందని కలలో కూడా అనుకోలేదట.