Balenciaga : ఈ బ్యాగు ధర ఎంతుంటుంది ? తెలిస్తే నోరెళ్లబెడుతారు

బ్యాగును ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే..ఫుల్ డిమాండ్ వచ్చింది. బ్యాగ్ ధర ఎంతుంటుందో అని తెలుసుకున్న వారు నోరెళ్లబెట్టారు. ఈ బ్యాగ్ అక్షరాల రూ. 2090 డాలర్లు (రూ. 1.53 లక్షలు).

Balenciaga : ఈ బ్యాగు ధర ఎంతుంటుంది ? తెలిస్తే నోరెళ్లబెడుతారు

Bag

Balenciaga Website : ఒక బ్యాగు ధర ఎంతుంటుంది ? రూ. 100 నుంచి 1000 వరకు ఉంటుందంటారు. సామాన్య, మధ్య తరగతి, వారి వారి స్థోమతను బట్టి బ్యాగులను కొనుక్కొంటుంటారు. సెలబ్రెటీలు అయితే..వారి బ్యాగులు లక్షల ధరల్లో ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే..ఓ బ్యాగును ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే..ఫుల్ డిమాండ్ వచ్చింది. ఈ షాపింగ్ బ్యాగ్ ధర ఎంతుంటుందో అని తెలుసుకున్న వారు నోరెళ్లబెట్టారు. ఈ బ్యాగ్ అక్షరాల రూ. 2090 డాలర్లు (రూ. 1.53 లక్షలు).

Read More : MAA Election: భారీగా నాగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రకాష్‌రాజ్ టీమ్ నుండి ఆహ్వానాలు!

ఈ బ్యాగ్ ను లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ Balenciaga ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. ఓ ఇన్ స్ట్రాగ్రామ్ యూజర్ ఆ బ్యాగ్ స్క్రీన్ షాట్ తీసి తన అకౌంట్ లో షేర్ చేసి…Balenciaga బ్రాండ్ pishviని యూఎస్ డాలర్స్ 2000కు అమ్ముతున్నారు..ఇప్పటి వరకు ఇంత ఖరీదైన బ్యాగును చూస్తానని అనుకోలేదని అని రాసుకొచ్చారు.

Read More : US military: మరో 24నుంచి 36 గంటల్లో ఉగ్రదాడి జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన

ఎవరైనా మరాఠీ ఫ్రెండ్ ఉంటే..వాళ్లకు ఈ పోస్టును టాగ్ చేసి pishvi అంటే ఏంటో అడగండి..అతని అతడు పోస్టు పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు pishvi అంటే ఏమిటీ ? అనేది ఎవరికీ అర్థం కాలేదు. పిష్వీ అనేది మరాఠీ పదం. పిష్వీ అంటే తైలీ అని అర్థం. తైలీ అంటే తెలుగు భాషలో సంచీ. మరాఠీలు మార్కెట్ కు వెళ్లి వచ్చిన తర్వత.. ఆ బ్యాగులను మంచం పరువు కింద దాస్తారాట. ఆ ఉద్దేశ్యంతోనే ఆ వ్యక్తి మంచం కింద దాచే..ఈ సంచి 1.5 లక్షల రూపాయలా ? అంటూ నోరెళ్ల బెట్టారు.