China-Dalai Lama: దలైలామాను మీ దేశంలోకి రానిచ్చారో..: శ్రీలంకను బెదిరిస్తున్న చైనా

ఒకవేళ శ్రీలంకలో దలైలామా పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వాన్ని చైనా అధికారులు ఇటీవలే హెచ్చరించారని సండే టైమ్స్ తెలిపింది. గత ఏడాది డిసెంబరు 27న భారత్ లోని బిహార్ లోని బోధగయాకు వచ్చిన శ్రీలంక బౌద్ధమతాధికారులు దలైలామాను కలిశారు. శ్రీలంకకు రావాలని ఈ సందర్భంగా దలైలామాను వారు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో దలైలామా పర్యటించకుండా చేసేందుకు చైనా కుట్రలు పన్నుతోంది.

China-Dalai Lama: దలైలామాను మీ దేశంలోకి రానిచ్చారో..: శ్రీలంకను బెదిరిస్తున్న చైనా

Dalai Lama

China-Dalai Lama: బౌద్ధమత గురువు దలైలామాకు శ్రీలంక ‘రెడ్ కార్పెట్’ స్వాగతం పలకకుండా చైనా కుతంత్రాలకు పాల్పడుతోంది. శ్రీలంకను బెదిరిస్తూ, దౌత్య పరంగా ఒత్తిడి తెస్తోంది. ఈ వివరాలను సండే టైమ్స్ ఓ నివేదికలో తెలిపింది. శ్రీలంకలో దలైలామా పర్యటించకుండా చేసేందుకు ఆ దేశ ప్రభుత్వంతో చైనా అధికారులు చర్చలు జరిపారని పేర్కొంది.

ఒకవేళ శ్రీలంకలో దలైలామా పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వాన్ని చైనా అధికారులు ఇటీవలే హెచ్చరించారని సండే టైమ్స్ తెలిపింది. గత ఏడాది డిసెంబరు 27న భారత్ లోని బిహార్ లోని బోధగయాకు వచ్చిన శ్రీలంక బౌద్ధమతాధికారులు దలైలామాను కలిశారు. శ్రీలంకకు రావాలని ఈ సందర్భంగా దలైలామాను వారు ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో దలైలామా పర్యటించకుండా చైనా కుట్రలు పన్నుతోంది. తదుపరి దలైలామా ఎంపిక విషయంలో చైనా.. టిబెట్ కు హెచ్చరికలు చేసింది. 1959లో దలైలామా టిబెట్ నుంచి భారత్ కు శరణార్థిగా వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉంటున్నారు. 1951 నుంచి టిబెట్ ను చైనా తమ అధీనంలోకి తీసుకుంది. తదుపరి దలైలామాను ఎంపిక చేసే అధికారం తమదేనని వాదిస్తోంది. బౌద్ధమత గురువులు చైనా తీరుపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.

School Teacher: విద్యార్థినిలపై టీచర్ లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన అధికారులు