St Louis: స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు

స్కూల్ లో కాల్పులు జరిగిన సమయంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కాల్పుల్లో ఓ టీనేజ్ బాలిక పాఠశాలలోనే మరణించగా, ఒక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించింది.

St Louis: స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు

St Louis

St Louis: మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌ నగరంలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు స్కూల్‌లోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా, ఏడుగురికి గాయాలయ్యాయి. సోమవారం ముష్కరుడు సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ హైస్కూ‌ల్లోకి ప్రవేశించాడు. పాఠశాల భవనం తలుపులకు తాళంవేసి ఉండటంతో నిందితుడు ఎలా లోపలికి వచ్చాడనే విషయంపై స్పష్టత లేదు.

3-Year-Old Shoots Toddler: 15 నెలల చిన్నారిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల బాలుడు 

స్కూల్ లో కాల్పులు జరిగిన సమయంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కాల్పుల్లో ఓ టీనేజ్ బాలిక పాఠశాలలోనే మరణించగా, ఒక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించింది. గాయపడిన ఏడుగురిలో ముగ్గురు బాలికలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అయితే, కాల్పులు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అప్పటికే పోలీసులను చూసి నిందితుడు పరారవుతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్ర గాయాలతో మరణించాడు. అయితే నిందితుడిని 19ఏళ్ల మాజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. నగరం పోలీసు కమిషనర్ మైఖేల్ సాక్ తెలిపిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి వద్ద పొడవైన తుపాకీ ఉందని చెప్పారు. పోలీసులు వచ్చే సమయానికి విద్యార్థులు పాఠశాల నుండి బయటకు పరుగులు తీస్తున్నారు. పోలీసులకు వేగంగా సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలికి చేరుకున్నారు. పోలీసులను చూసి దుండగుడు పరారయ్యాడు. పోలీసులు కాల్పులు జరిపారని తెలిపారు. ఇదిలాఉంటే..  కాల్పులు జరిపిన వ్యక్తి గత సంవత్సరం ఇదే  పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడని, అతనికి నేరపూరిత ప్రవర్తన చరిత్ర లేదని పోలీసులు తెలిపారు.