Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి

ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్‌ట్రాక్ రైలు.. లాస్ ఏంజిలిస్ నుంచి చికాగోకు వెళ్తుంది. రైలు ఢీకొట్టిన వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది.

Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి

train crash in US : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిస్సోరిలోని మెండన్‌ టౌన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ భారీ ట్రక్‌ను రైలు ఢీకొట్టడంతో పట్టాలు తప్పి బోగీలన్ని పక్కకు ఓరిగిపోయాయి. రెస్క్యూ టీమ్స్‌ ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.

ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్‌ట్రాక్ రైలు.. లాస్ ఏంజిలిస్ నుంచి చికాగోకు వెళ్తుంది. రైలు ఢీకొట్టిన వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది. టైర్లు ఎగిరిపడ్డాయి. కొన్ని మీటర్ల దూరం వరకు రైలు ట్రక్కును లాక్కెళ్లి.. ఆ తరువాత పట్టాలు తప్పింది.

Congo Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి!

బోగీలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికులు.. కిటికీ అద్దాలను పగులగొట్టుకుని బయటికి రావడం కనిపించిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. స్వల్పంగా గాయపడ్డ వారిని ప్రత్యేక బస్సుల్లో మెండన్ టౌన్‌లోని ఓ స్కూల్‌కు తరలించారు.

అక్కడే మెడికల్ క్యాంప్‌ ఏర్పాటు చేసి చికిత్స అందించారు. ఇక తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రత్యేక హెలికాప్టర్‌లో కాన్సాస్ సిటీకి తరలించారు. మరికొందరిని కొలంబియా యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన పట్ల మిస్సోరి గవర్నర్ మైక్ పర్సన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్నారు అధికారులు.