Next Dalai Lama : తదుపరి దలైలామా ఎంపిక కోసం రహస్య కమిటీ ఏర్పాటు చేసిన చైనా!

దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.

Next Dalai Lama : తదుపరి దలైలామా ఎంపిక కోసం రహస్య కమిటీ ఏర్పాటు చేసిన చైనా!

Lama

Next Dalai Lama దలైలామా వారసుడి విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది. కాగా, ప్రస్తుతం తన మరణంపై జరుగుతున్న చర్చలను..తొందరపాటు విషయంగా పేర్కొన్నారు బౌద్ధ మత గురువు దలైలామా. ఇటీవల 86ఏళ్లు పూర్తి చేసుకున్న దలైలామా..తన సొంత విజన్ ప్రకారం తాను 113 ఏళ్లు బ్రతికే అవకాశముందన్నారు. అయితే దలైలామా చనిపోకముందే ఆయన వారసుడిని ఎంపిక చేసే అధికారం ఎవరికుందనే విషయమై ఇప్పుటికే చైనా-టిబెట్ మధ్య వివాదం తీవ్రతరమైంది. తదుపరి దలైలామా ఎంపిక కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే గ్రౌండ్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. దలైలామా ఎంపిక ప్రక్రియ ప్రారంభించడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనవరిలో 25 మంది సీనియర్ ప్రభుత్వ వ్యక్తులతో రహస్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాాచారం.

అయితే 1995 లో జరిగిన గందరగోళ సంఘటనలను పునరావృతం చేయకుండా ఉండేందుకు చైనా ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. 1995లో చైనా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, దలైలామా.. ఆరేళ్ల బాలుడు గెధున్ చోకీ నైమా అనే ఆరేళ్ల బాలుడిని తదుపరి పంచన్ లామా( టిబెటన్ బౌద్ధమతంలో రెండవ అతి ముఖ్యమైన వ్యక్తి) అని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వెలువడిన మూడు రోజుల తరువాత ఆరేళ్ల బాలుడు నైమా అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ బాలుడి ఆచూకీ దొరకలేదు. చైనానే ఆ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. కనిపించలేదు. అయితే నైమా స్థానంలో చైనా ప్రభుత్వం నియమించిన పంచెన్ లామాను చాలా మంది టిబెటన్లు తిరస్కరించారు.

తదుపరి దలైలామాను ఎంచుకోవడానికి మరియు నియంత్రించడానికి చైనా ప్రభుత్వం స్పష్టంగా నిశ్చయించుకోవడం కూడా.. టిబెట్ పై వారి నియంత్రణను దెబ్బతీసిన ప్రస్తుత ఆధ్యాత్మిక నాయకుడి(దలైలామా) శాశ్వత ప్రజాదరణకు ప్రతిస్పందనగా పరిగణించబడుతుంది. విస్తృతమైన “రీ-ఎడ్యుకేషన్” మరియు ప్రచార కార్యక్రమాలు మరియు టిబెట్ లోపల దలైలామా ఫొటోలను చైనా నిషేధించినప్పటికీ.. ఇప్పటికీ అనేకమంది టిబెటన్లు దలైలామాని గౌరవిస్తారనే విషయం చాలా సందర్భాల్లో ప్రపంచానికి తెలిసింది. చైనా ప్రభుత్వం ఇప్పటికీ.. దలైలామాను “వేర్పాటువాద” కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తి అని పదేపదే ఆరోపిస్తోంది. 2008 లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగిన టిబెటన్ తిరుగుబాట్లకు కూడా దలైలామానే చైనా బాధ్యుడిగా చూపిస్తోంది

దలైలామా ఎంపిక ఎలా జరుగుతుంది
దలైలామా..అనేది టిబెట్ ‌లోని గెలుగ్ శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు. టిబెట్ లోని సాంప్రదాయిక బౌద్ధ శాఖల్లో ఇది అత్యంత నవీనమైనది. ప్రస్తుత దలైలామా, దలైలామాల పరంపరలో 14 వ వారు. టిబెటన్ బుద్ధుల విశ్వాసం ప్రకారం ప్రతి దలైలామా.. అవలోకితేశ్వరుని పునర్జన్మ. బుద్ధులందరి కరుణను మూర్తీభవించినవాడిన పేరుపొందిన అవలోకితేశ్వరుడు టిబెటన్ బౌద్ధమతం యొక్క గెలుగ్ స్కూల్ లో అగ్రశ్రేణి ఆధ్యాత్మి1క నాయకుడు మరియు అనేక సార్లు గతంలో మరియు ప్రస్తుతం టిబెటన్ల రాజకీయ నాయకుడు కూడా.

సాంప్రదాయకంగా, ఒక దలైలామా మరణించిన తర్వాత టిబెట్‌లో అతని పునర్జన్మను కనుగొనడానికి ఒక శోధన ప్రారంభమవుతుంది. ఆయన మరణించినప్పుడు ఆయన ఎటువైపు చూశాడు..ఆయనని దహనం చేసినప్పుడు పొగ ఎటువైపు మళ్లుతోంది మరియు టిబెట్‌లోని ఒరాకిల్ సరస్సు అయిన లామో లా-త్సో వివరించే విజన్స్ ఆధారంగా దలైలామా వారసుడి ఎంపిక కోసం శోధన ప్రారంభమవుతుంది. ఈ దర్శనాల ఆధారంగా..దలైలామా మరణించిన రోజునే ఈ విజన్స్ తో సరిపోయేవిధంగా జన్మించిన పిల్లలను కనుగొనడానికి బౌద్ధ మత పెద్దలు ఓ బృందాన్ని పంపుతారు. సరైన వ్యక్తిని దలైలామాగా నిర్ణయించేందుకు చాలా టెస్ట్ లను ఆ బౌద్ధ బృందం నిర్వహిస్తుంది. కాగా,చాలా మంది దలైలామాలు టిబెట్‌లో కనుగొనబడ్డారు. ఒకరు మాత్రం మంగోలియాలో జన్మించారు మరియు మరొకరు ఇప్పుడు భారతదేశంలో ఉన్నారు. 1940 ఫిబ్రవరి లో ఈశాన్య టిబెట్‌లోని ఒక చిన్న వ్యవసాయ గ్రామంలో రెండు సంవత్సరాల లామో దొండుప్-ప్రస్తుతం టెంజిన్ గయాట్సో గా పిలువబడుతున్న 14 వ దలైలామాని కనుగొన్నారు.

చైనా ప్రకటనను తప్పుబట్టిన దలైలామా
అయితే ఈ సంప్రదాయం తదుపరి దలైలామా ఎంపిక విషయంలో పునరావృతమయ్యే అవకాశం కనిపించడం లేదు. దలైలామాతో సహా సీనియర్ బౌద్ధ లామాస్ (ఉపాధ్యాయులు) యొక్క అందరు వారసులను చైనా ప్రభుత్వం ఆమోదించాలని ఇప్పుడు చట్టంలో పొందుపరచబడినట్లు ఈ ఏడాది మేలో చైనా విడుదల చేసిన టిబెట్ శ్వేతపత్రంలో గట్టిగా పునరుద్ఘాటించింది.

అయితే దీనిని దలైలామా మరియు ధర్మశాలలోని ప్రవాసంలో ఉన్న టిబెటన్ పార్లమెంట్(బహిషృత పార్లమెంట్ గా కూడా పిలువబడే) తిరస్కరిస్తోంది. విశ్వాసం లేని, నాస్తిక ప్రభుత్వమైన చైనా..”టిబెట్ ఆధ్యాత్మిక విషయాలలో జోక్యం చేసుకోవడాన్ని ఆమోదించే ప్రశక్తే లేదని ప్రవాస టిబెటన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ పెన్పా సెరింగ్ అన్నారు ప్రపంచం చైనాకు వ్యతిరేకంగా మారిందని.. వారి ఎంపికను ఎవరూ విశ్వసించరని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. దలైలామా కూడా చైనా ప్రకటన విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. తన తదుపరి దలైలామానిని చైనా హైజాక్ చేసి, రాజకీయం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దలైలామా తన పునర్జన్మ కోసం మూడు ఎంపికలను ముందుకు తెచ్చాడు. మొదటిది.. అతను సాంప్రదాయ రూపంలో పునర్జన్మ పొందుతాడు. పిల్లవాడిగా తిరిగి జన్మిస్తాడు. టిబెట్ వెలుపల పునర్జన్మ పొందుతాడు. ఇక,ఇతర ఎంపికలు “ఉద్భవించడం” అనే బౌద్ధమత ఆలోచనలను మరింతగా ప్రోత్సహించాయి మరియు దలైలామా చనిపోయే ముందు వారసుడిని నియమించే అవకాశాన్ని తెరమీదకి తెచ్చింది. తన పునర్జన్మను కనుగొనడానికి చైనా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టబద్ధతను దలైలామా తిరస్కరించాడు. పునర్జన్మ సమస్య గురించి చైనీయులు నిజంగా ఆందోళన చెందుతుంటే, వారు మొదట మావో జెడాంగ్,డెంగ్ జియావోపింగ్(మరణించిన చైనా కమ్యూనిస్ట్ నాయకులు) యొక్క వారసుడి కోసం చూడాలని, ఆపై దలైలామా కావచ్చు అని దలైలామా చాలాసార్లు చెప్పారు

శరణార్థిగా భారత్ కు

1959లో టిబెట్ నుంచి దలైలామా శరణార్థిగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో దలైలామా నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ధర్మశాలలో టిబెటన్ నాయకుల సమావేశం సందర్భంగా… 14 వ దలైలామా అయిన “టెన్జిన్ గయాట్సో”ని పునర్జన్మ గురించి కొంతమంది ఆయనను ప్రశ్నించగా.. గదిలోని సన్యాసులు, మత గురువులు మరియు టిబెటన్ రాజకీయ నాయకుల ఉద్దేశించి..నా కళ్ళలోకి చూడండి అని దలైలామా వారిని కోరారు. ఇప్పుడు సమయం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అని వారిని దలైలామా అడిగారు. దీంతో ఈ మీటింగ్ లో..పునర్జన్మ సమస్యని దలైలామా మాత్రమే నిర్ణయిస్తారని టిబెట్ నాయకులు అంగీకరించారు. అయితే 1951 లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా అప్పటి నుండి ఈ ప్రాంతంపై గట్టి నియంత్రణను కలిగి ఉంది. తదుపరి దలైలామా ఎంపిక కేవలం చైనా నిర్ణయమేనని,ఈ హక్కును చైనా చట్టంలో కూడా పొందుపరిచినట్లు డ్రాగన్ దేశం నొక్కి చెబుతోంది.

అయితే ప్రస్తుతం 14వ దలైలామాగా ఉన్న టెంజిన్ గ్యాట్సో మరణిస్తే..ఆయన స్థానంలో ఇద్దరు దలైలామాలు ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాము భావిస్తున్నట్లు టిబెట్ నిపుణుడు రాబర్ట్ బర్నెట్ పేర్కొన్నారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సూచించిన ఒక వ్యక్తి మరియు ప్రస్తుత దలైలామా వదిలిపెట్టిన సూచనల ఆధారంగా మరో వ్యక్తి ఎంపిక అవుతారని తెలిపారు.

భారత్-చైనా సంబంధాల్లో కీలకం

మరోవైపు, దలైలామా వారసత్వంపై నిఘా నేత్రం ఉంచిన ఏకైక దేశం చైనా ఒక్కటే అనుకుంటే పొరపాటే. భారత్-చైనా మధ్య సంబంధాల్లో కూడా టిబెట్,దలైలామా ఎంపిక ఒక సున్నితమైన అంశం. అయితే సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా గత ఏడాదిగా చైనాతో భారత్ సంబంధాలు కనిస్ఠానికి దిగజారిపోయిన నేపథ్యంలో..చైనాకి కౌంటర్ ఇచ్చేందుకు, టిబెట్ పాలసీని బలోపేతం చేయాలని,కేవలం దలైలామాకి మాత్రమే తన వారసుడిని ఎంపిక చేసే అధికారముందని ప్రకటించాలని భారత ప్రభుత్వం ఒత్తిడి పెరిగింది. గత నెలలో భారత ప్రధాని మోదీ..ట్విట్టర్ ద్వారా దలైలామాకి పుట్టినరోజు శుభాకాంక్షలె తెలియజేయడం.. మునుపటి పాలసీ నుండి “గణనీయమైన నిష్క్రమణ” గా వర్ణించబడింది. టిబెట్ విషయంలో భారత్ తన పాత పాలసీని వీడినట్లు ఇది తెలియజేస్తుంది. కాగా, ఈ ఏడాది దలైలామా-మోదీ మధ్య ఓ మీటింగ్ కూడా జరగనున్నట్లు సమాచారం.

దలైలామా వారసుడి ఎంపికపై వివాదాలు భారతదేశంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. దలైలామా స్వయంగా.. తాను “స్వేచ్ఛా దేశంలో” పునర్జన్మ పొందవచ్చు, ఇది టిబెట్ కాకుండా భారతదేశం కావచ్చు అని వ్యాఖ్యానించడం ఇప్పుడు కీలకంగా మారింది. అంతేాకాకుండా తానే వచ్చే జన్మలో మహిళగా పుట్టే అవకాశముందని దలైలామా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి.గత వారం, దలైలామా యొక్క అంతర్గత సర్కిల్‌లోని అనేక మంది సభ్యులు, అలాగే టిబెట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్‌లోని సీనియర్ వ్యక్తుల ఫోన్లు పెగాసస్ స్పైవేర్‌ తో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఈ హ్యాకింగ్ లో ఉన్నట్లు ఆరోపణలు రాగా..భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండించింది. తాము ఎవరిపైనా నిఘా పెట్టలేదని భారత ప్రభుత్వం సృష్టం చేసింది.

దలైలామా వారసత్వాన్ని భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా ఒక్క భారత్ మాత్రమే చూడటం లేదు. గత సంవత్సరం నేరుగా చైనాని టార్గెట్ చేస్తూ..తదుపరి దలైలామాను ఎన్నుకునే హక్కు టిబెట్‌లకు మాత్రమే ఉందని ప్రకటించడంతో అమెరికా తన టిబెట్ విధానాన్ని సవరించింది. చైనా జోక్యం లేకుండా దలైలామా వారసుడి ఎంపిక స్వతంత్రంగా జరగాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే బిల్లు తీసుకొచ్చింది అమెరికా. దీని ద్వారా టిబెట్​లో అమెరికా కాన్సులేట్​ను ఏర్పాటు చేసి అంతార్జాతీయ కూటమిని ప్రతిపాదించింది. 15వ దలైలామా ఎంపికలో జోక్యం చేసుకునే చైనా అధికారులపై ఆంక్షలు విధించేలా విధానాలు రూపొందించింది. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వమూ ఆ విధానాలనే పాటిస్తోంది.