TikTok Facebook : టిక్‌టాక్ దూకుడు.. ఫేస్‌బుక్‌ని బీట్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ దూకుడు మీదుంది. ఏకంగా ప్రపంచ నెంబర్ 1 సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ నే బీట్ చేసింది. 2020లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ

TikTok Facebook : టిక్‌టాక్ దూకుడు.. ఫేస్‌బుక్‌ని బీట్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది

Tiktok Facebook

TikTok Facebook : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ దూకుడు మీదుంది. ఏకంగా ప్రపంచ నెంబర్ 1 సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ నే బీట్ చేసింది. 2020లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ డౌన్‌లోడ్స్ అయిన యాప్‌గా టిక్‌టాక్ హిస్టరీ క్రియేట్ చేసింది. అప్ప‌టివ‌ర‌కు టాప్‌లో ఉన్న పేస్‌బుక్‌ను కిందికి నెట్టేసి.. టిక్‌టాక్ మొద‌టిస్థానంలో నిలిచింది.

బిజినెస్ జ‌ర్న‌ల్ Nikkei Asia.. సోష‌ల్ మీడియా యాప్స్ డౌన్‌లోడ్స్ మీద చేప‌ట్టిన గ్లోబ‌ల్ స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఇందులో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఒక్క‌సారిగా టిక్‌టాక్ గ్లోబ‌ల్ మార్కెట్‌లో పుంజుకుని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బ‌తీసింది.

2018 నుంచి చేప‌డుతున్న స‌ర్వేలో టిక్‌టాక్ త‌న మార్కెట్‌ను గ్లోబ‌ల్‌గా విస్త‌రించుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల‌.. డౌన్‌లోడ్స్‌లో టాప్ పొజిష‌న్‌లోకి వ‌చ్చింద‌ని జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. 2019లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా యాప్స్ డౌన్‌లోడ్స్‌లో టిక్‌టాక్ 4వ స్థానంలో ఉండేది. నాలుగో స్థానం నుంచి 2020లో మొద‌టి స్థానానికి టిక్‌టాక్ ఎగ‌బాకింది. 2019లో ఫేస్‌బుక్ రెండో స్థానంలో ఉండ‌గా.. 2020లో కూడా అదే రెండో స్థానంతో ఫేస్‌బుక్ స‌రిపెట్టుకుంది. అయితే.. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ మాత్రం త‌న మొద‌టి స్థానం నుంచి ఐదో స్థానానికి ప‌డిపోయింది.

చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌.. చైనీస్ వ‌ర్ష‌న్ Douyin కూడా చైనాలో రికార్డులు క్రియేట్ చేసింది. చైనాలో మొద‌టిస్థానాన్ని ద‌క్కించుకుంది. యూఎస్‌లో కూడా 2020లో డౌన్‌లోడ్స్‌లో టిక్‌టాక్ టాప్‌లో నిలిచింది. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ను వెన‌క్కి నెట్టి.. మొద‌టి స్థానంలో నిలిచింది. 2020లో చైనా కాకుండా.. మిగితా ఏసియా దేశాల్లో డౌన్‌లోడ్స్‌లో టిక్‌టాక్ రెండో స్థానంలో ఉంది. ఫేస్‌బుక్ మొద‌టి స్థానంలో ఉంది.

అందులో టిక్‌టాక్ కూడా ఉంది. అమెరికా‌, యూకేలో టిక్‌టాక్ వ్యూయింగ్ టైమ్‌.. యూట్యూబ్‌ను మించిపోయింద‌ట‌. దీన్ని బ‌ట్టి.. షార్ట్ వీడియోల‌కు ఎంత డిమాండ్ ఉందో.. అర్థం చేసుకోవ‌చ్చు.. అని Nikkei Asia త‌రుపున ఈసర్వే నిర్వ‌హించిన App Annie సంస్థ మార్కెటింగ్ మేనేజ‌ర్ చుజెన్ కిన్ స్ప‌ష్టం చేశారు.

2020లో 10 టాప్ డౌన్‌లోడ్స్ అయిన యాప్స్‌లో నాలుగు యాప్‌లు ఫేస్‌బుక్‌కు చెందిన‌వి. అవి కూడా టాప్ 5 లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. వాట్స‌ప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌.. ఈ నాలుగు యాప్స్‌.. ఫేస్‌బుక్ సంస్థ‌కు చెందిన‌వి. అయితే.. భారత్ లో గ‌తేడాది జూన్ నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య సుమారు చైనాకు చెందిన సుమారు 200 యాప్‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అందులో టిక్ టాక్ కూడా ఉంది. భారత్ వంటి అతిపెద్ద దేశంలో నిషేధానికి గురైనా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యూజర్లు డౌన్ లోడ్ చేసిన యాప్ గా టిక్ టాక్ నిలవడం విశేషం.